A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
న్యాయ వ్యవస్థ క్షాళన అవుతుందా
Share |
March 24 2018, 5:53 am

సుప్రింకోర్టులో జరిగిన పరిణామాలు న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను బహిర్గతం చేసిందని భావించాలి. నలుగురు సీనియర్ న్యాయమూర్తులు చలమేశ్వర్, గగోయ్, లోకూర్, జోసెఫ్ లు బహిరంగంగా చీప్ జస్టిస్ పై తమ అసమ్మతి గళం వినిపించారు. వారు ఏ కారణం తో బయటకువ చ్చినా, దేశ వ్యాప్తంగా న్యాయ వ్యవస్థను ఒక కుదుపు కుదినిపట్లయింది. గతంలో జస్టిస్ కర్నన్ సుప్రింకోర్టును ప్రశ్నించినందుకు ,దిక్కారంగా వ్యవహరించినందుకు జైలుకు పంపిన సుప్రింకోర్టులోనే ఇంత తీవ్రమైన ఘట్టం చోటు చేసుకుంది.ఇది క్రమశిక్షణ రాహిత్యం అవుతుందా అన్న చర్చ ఉంది. మీడియా ముందుకు వచ్చిన న్యాయమూర్తులు దీని గురించి మాట్లాడలేదు.తప్పనసరి పరిస్థితిలో వచ్చామని, దేశ న్యాయ వ్వవస్థ స్వతంత్రత కోల్పోరాదని వచ్చామని చెప్పారు. వారు ఎంత ఆవేదన పడ్డారన్నది కూడా ముఖ్యమైన అంశమే.దీనిపై రెండు రకాల వాదనలు ముందుకు వచ్చాయి. మహారాష్ట్రలో జడ్జి లోయ అనుమానాస్పద మృతి కేసును తమకన్నా జూనియర్ జడ్జిలకు అప్పగించడం, మెడికల్ సీట్ల కుంబకోణంలో జడ్జిపాత్రపై విచారణ విషయంలో బిన్నా భిప్రాయాలు ఏర్పడడం వంటి అంశాలు వీరు గళం విప్పడానికి కారణం అయ్యాయి.వీరు బయటకు రావడం ద్వారా ఇంతకాలంగా సామాన్యుడు కోర్టుల గురించి ఏమనుకుంటున్నారో దానిని దృవీకరించారని అనుకోవాలి.అయితే చలమేశ్వర్ చీప్ జస్టిస్ కు సంబందం లేకుండా నిర్ణయం తీసుకోవడం కూడా వివాదం అయింది.న్యాయమూర్తుల నియామకాలకు జ్యూడిషియల్ కమిషన్ ఉండాలని కూడా ఆయన వాదించారు.దీనికి ఆయనకుమంచి మద్దతే వచ్చింది.న్యాయ వ్యవస్థలో జరుగుతున్న దుష్పరిణామాలకు సీనియర్ న్యాయమూర్తుల వ్యాఖ్యలు పతాక సన్నివేశంగా కనిపిస్తాయి.నిజానికి సుప్రింకోర్టు మీదే కాదు.హైకోర్టులలో,ఆయా కోర్టులలో భిన్నరకాల తీర్పులు ఇవ్వడం, ఒకరి పట్ల ఒకరకంగా తీర్పు,అదే తరహా కేసులో మరో రకం తీర్పు ఇవ్వడం ,మూడు రోజులు లేదా,మూడు నెలల్లో ఇవ్వవలసిన బెయిళ్లను ఏడాది,రెండేళ్లు ఇవ్వకుండా కొందరిని ఇబ్బంది పెట్టడం, రాజకీయ ప్రేరణతో తీర్పులు వస్తున్నాయన్న అనుమానం కలిగేలా జడ్జిలు వ్యవహరించడం వంటి ఘట్టాలు ఎన్నో చూశాం.నిజానికి ఇంత ప్రాముఖ్యత కలిగిన జడ్జి పోస్టులు రాజకీయపరంగా సాగుతుండడం కూడా వివాదం అవుతోంది.కొందరు జడ్జిలు రిటైరయ్యాక పదవులు ఆశించడం, వేరే పదవులలో చేరిపోవడం,సరిగ్గా అంతకు ముందే రాజకీయ కేసులలో తీర్పులు ఇవ్వడం వంటివి జరగడం ప్రజలలో అనుమానాలకు దారి తీస్తోంది.శశికళ కేసు కూడా ఒక పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది.ఆమె ముఖ్యమంత్రి అభ్యర్ధి అయ్యాకే సుప్రింకోర్టు ఆమె కేసు ప్రస్తావనకు వచ్చిన తీరుపై విమర్శలు ఉన్నాయి.రెగ్యులర్ ప్రక్రియలో ఎందుకు ఆ కేసు రాలేదన్నది అర్ధం కాని విషయం.ఇవన్ని ఎందుకు సీనియర్ న్యాయవాది దుష్యంత్ ఒకసారి ధర్మాసనం ముందు నిలబడి జడ్జిలు కోర్టు కారిడార్ లో తిరిగితే వారి గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నది తెలుస్తుందని వ్యాఖ్యానించారు.జడ్జిలకు జవాబుదారి తనం లేకపోతోందన్నది చాలా మంది అభిప్రాయం. కొందరు న్యాయమూర్తులు కొంతమంది రాజకీయ నేతలను రక్షించడంలో నిమగ్నమై ఉండడం కూడా జరుగుతోందన్న భావన ఉంది.వీటన్నిటి గురించి సామాన్యుడు పైకి చెప్పుకోలేని పరిస్థితిలో న్యాయమూర్తులే తమ బాద ఏకరవు పెట్టారు.ఇప్పుడు ఈ వివాదం మొత్తం న్యాయ వ్యవస్థ క్షాళనకు దారి తీస్తుందా?లేక మరింత సంక్లిష్టంగా మారుతుందా అన్నది చూడాలి. మార్పుకు నాంది అయితే,అందులో ఒక తెలుగు జడ్జి కూడా ఉన్నందుకు సంతోషించాలి..

tags : judges, supremecourt,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info