A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శశికళ ఆదాయపన్ను ఎగవేత 5 వేల కోట్లా
Share |
December 10 2018, 10:07 am

తమిళనాడులో అన్నా డి.ఎమ్.కె.బహిషృత నేత,ప్రస్తుతం జైలులో ఉన్న శశికళ కుటుంబ సభ్యులు ఆదాయపన్ను ఎగవేత వ్యవహారం పై మీడియాలో వచ్చిన కధనాలు ఆసక్తికరంగా ఉన్నాయి.శశికళ కుటుంబ సభ్యులు,బంధువులు అంతా కలిసి ఎగవేసిన ఆదాయపన్ను ఐదు వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.గత సంవత్సరం నంబంరు 9న ఏకకాలంలో పలుచోట్ల ఐటీ సోదాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 215 ప్రాంతాల్లో ఈ సోదాలు జరగ్గా అందులో చెన్నైలోనే 115 ప్రాంతాలు ఉన్నాయి.ఈ సోదాల్లో రూ.1,450 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు.తదుపరి మాజీ ముఖ్యమంత్రి ,దివంగత నేత జయలలిత నివాసమైన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో సోదాలు జరిపి కంప్యూటరు హార్డ్‌ డిస్క్‌లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 20పైగా డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి వాటిద్వారా రూ.కోట్లలో నగదు బదలాయింపులు జరిగిన ఆధారాలను కూడా ఐటీ అధికారులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు.జయలలిత ఇంటిలోఇవన్ని దొరికాయంటే శశికళ ఒక్కటే తప్పు చేసినట్లా?జయలలిత కూడానా?

tags : sasikala,it

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info