A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో పద్మావత్ కు బిజెపి ఎమ్మెల్యే అడ్డు
Share |
December 10 2018, 9:17 am

పద్మావత్ సినిమాకు సెన్సార బోర్డు అనుమతి ఇచ్చినా ,కొన్ని చోట్ల బిజెపి ఎమ్మెల్యేలు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదశ్ కూడా అనుమతి వచ్చిన ఈ సినిమాను అడ్డుకోవడానికి హైదరాబాద్ లోని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రయత్నిస్తున్నారు.ఘోషా మహల్ నియోజకవర్గంలోని రామకృష్ణ, తారకరామ,స్వప్ప,సంతోష్ ,వెంకట రమణ దియేటర్ల మేనేజర్ల వద్దకు రాజాసింగ్ వెళ్లి వారిని ఈ సినిమా విడుదల చేయవద్దని కోరారట.హైదరాబాద్ లో పదిహేను లక్షల మంది కర్నీ రాజపుత్ లు ఉన్నారని, వారు ఈ సినిమాకు నిరసనలు తెలిపే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.దీనిపై దియేటర్ల మేనేజర్లు స్పందించడానికి నిరాకరించారు.ప్రభుత్వ అనుమతితో సినిమా విడుదల అయితే తాము రక్షణ కల్పిస్తామని పోలీస్ కమిషనర్ చెప్పారు.

tags : padamavat,rajasingh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info