A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జడ్జిల తిరుగుబాటు-మోడీదే బాద్యత
Share |
January 18 2018, 5:34 am

ప్రధాని నరేంద్ర మోడీ వికృత చేష్టల వల్లే న్యాయ వ్యవస్థలో సంక్షోభం ఏర్పడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు.దీనికి మోడీ బాద్యత వహించి సుప్రింకోర్టు న్యాయమూర్తులు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.లీగల్ గా,టెక్నికల్ గా న్యాయమూర్తులు ఇలా మీడియా ముందుకు రావడం సరికానప్పటికీ, వారు ఎంత ఆవేదనకు గురైతే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది అర్దం చేసుకోవాలని ఆయన అన్నారు.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కలిఖోపుల్ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ , మెడికల్ సీట్ల కుంభకోణంలో జడ్జి పాత్ర ,జడ్జి లోయ అనుమానాస్పద మృతి కేసు వంటివి ఈ పరిణామాలకు దారి తీశాయని ఆయన అన్నారు.లోయ కేసుకు బిజపి అద్యక్షుడు అమిత్ షా కేసుకు లింక్ ఉందని నారాయణ అన్నారు.

tags : narayana, cpi, judges

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info