A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతులకు పెట్టుబడి సాయం-కొత్త మతలబు
Share |
December 12 2018, 8:34 am

తెలంగాణ ప్రభుత్వం రబీలో కాకుండా ఖరీఫ్ లో పెట్టుబడి సాయం ఇవ్వడానికి సిద్దమవుతుండడంతో రెట్టింపు ఖర్చు అవుతోందని ఒక విశ్లేషణ వచ్చింది. రబీలో సాగు చేసినవారికి గత ఏడాది ఇచ్చి ఉంటే సుమారు 2800కోట్ల రూపాయలు సరిపోయేదని, ఆ తర్వాత ఖరీఫ్ లో కొనసాగించి, పూర్తిగా సేద్యం చేసిన రైతులందరికి పెట్టుబడి సాయం కింద దు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు అవుతుంది.అయితే ముందుగా ఖరీఫ్ లో ఇచ్చిన తర్వాత ఈ ఏడాది కూడా ఇవ్వాల్సి వస్తే సేద్యం చేయని రైతులకు కూడా ఎకరాకు నాలుగు వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.పైగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నందున ప్రభుత్వం రిస్కు తీసుకోదలచ లేదని,అందువల్ల వచ్చే రబీ సీజన్ లో పంట వేసినా,వేయక పోయినా పెట్టుబడి సబ్సీడీ రూపేణా ఎకరాకు నాలుగువేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని చెబుతున్నారు.

tags : hyderabad, farermes, telangana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info