A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన స్పీకర్
Share |
January 18 2018, 5:35 am

ఆంద్ర ప్రదేశ్ , తెలంగాణలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా ఈ రాష్ట్రాల స్పీకర్ లు కోడెల శివప్రసాదరావు,మదుసూదనాచారిలు కాపాడుతున్నారన్న విమర్శులు ఎదుర్కుంటుండగా, త్రిపుర రాష్ట్రంలో మాత్రం ఫిరాయింప ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది.అక్కడ కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఎమ్మెల్యే రతన్ లాల్ నాధ్ పై త్రిపుర కాంగ్రెస్ అద్యక్షుడు ఫిర్యాదు చేశారు.కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచిన ఆయన బిజెపిలోకి మారారని,దీనిపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించి ఎమ్మెల్యే వివరణ కోరానని స్పీకర్ చెప్పారు. కాని ఆ ఎమ్మెల్యే తన ఎదుట హాజరు కాలేదని, దాంతో ఆయనపై అనర్హత వేటు వేశానని స్పీకర్ తెలిపారు.

tags : tripura, mla, disqualification

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info