A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు సేఫ్ గా ..కాని పేదలకే చిక్కొచ్చింది
Share |
December 10 2018, 10:10 am

ఏ దేశంలో అయినా విద్య,వైద్యం ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఆ దేశం సౌభాగ్యంగా ఉన్నట్లు లెక్క. ఆ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నట్లు అనుకోవచ్చు. ఎందుకంటే మనిషి జీవితంలో అవి రెండు కీలకమైనవి.అలాగని మిగిలిన విషయాలకు ప్రాదాన్యత లేదని కాదు. కాని ప్రతి కుటుంబానికి తిండి,బట్ట,నీడ ఎంత ముఖ్యమో, విద్య, వైద్యం కూడా అంతే కీలకం. భారత దేశంలో వైద్యం ఖర్చు భరించలేక ఎందరో పేదలు అకాల మరణాలకు గురి అవుతున్నారు.ప్రభుత్వాలు వీటిపై పెడుతున్న దృష్టి అంతంత మాత్రమే. దానివల్ల పేదలే కాదు. మద్య తరగతి వారు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. కొందరైతే ఆస్తులు అమ్మి ఆస్పత్రులలో చికిత్ప సొందవలసిన పరిస్థితి నెలకొంటుంది. వీటికి కొంత పరిష్కారంగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ వచ్చింది. పేద,మద్య తరగతికి కొంత ఊరట లభించింది. అప్పట్లో కార్పొరేట్ ఆస్పత్రులలో అతి సామాన్య నిరుపేద వృద్దులు ఉచితంగా వైద్యం చేయించుకోవడం మాత్రమే కాకుండా ఉచితంగా మందులు పొందిన ఘట్టాలు తరచు కనిపించేవి. కాని అలాంటి వారికి రాష్ట్ర విబజన కొంత నష్టం చేసినట్లుగా ఉంది. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లోని పేదలకు హైదరాబాద్ లోని నాణ్యమైన ,ఆదునిక వైద్యం అందకుండా పోయింది.ప్రదానంగా ఎపి ప్రభుత్వం హైదరాబాద్ లో చికిత్సలకు అనుమతించకపోవడమే కారణం. ప్రజలలో గొడవ వచ్చాక కొద్దిగా సడలించినా దానివల్ల ప్రయోజనం స్వల్పంగానే ఉంది.తెలుగుదేశం కు అనుకూలంగా ఉండే ఒక మీడియాలోనే దీనికి సంబందించిన కధనం సోదాహరణంగా ఇచ్చారు. ఎపి వారి పిల్లలు, వివిధ కారణాల రీత్యా హైదరాబాద్ కు వచ్చినవారు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోక, ఎపి ప్రభుత్వం పట్టించుకోక నానా పాట్లు పడుతున్నారని ఆ కదనం వివరించింది.సరిగ్గా ఇదే మాట వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ తన పాదయాత్రలో చెబుతున్నారు.ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్.టి.ఆర్.వైద్య సేవ అని పేరు పెట్టారు.అంతవరకుఅభ్యంతరం లేదు.కాని నిజంగానే దానివల్ల ప్రజలకు ఎక్కువ మేలు కలగాలి కదా.అందుకే జగన్ తాము అదికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ని సంపూర్ణంగా అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. సామాన్యులకు హైదరాబాద్ వైధ్యం అందాలంటే అంతవరకు ఆగక తప్పదనుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్పాలి.హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్లు ఇక్కడే రాజధాని ఉంటుందని సెక్రటేరియట్, లేక్ వ్యూ తదితర భవనాలను కోట్లు ఖర్చు చేసి రిపేర్లు చేయించారు. ఓటుకు నోటు కేసు ఫలితంగా ఆయన ఆంద్రులకు హైదరాబాద్ పై హక్కును వదలుకుని వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోవడమే కాదు. ఆంద్రులు ఎవరికి హైదరాబాద్ లో హక్కులేని విధంగా వ్యవహఱిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. విద్య,ఉపాధి,ఆరోగ్యం వంటి విషయాలలో హైదరాబాద్ ను పదేళ్లు వాడుకునే అవకాశం ఉన్నా, చంద్రబాబు చేసిన తప్పుకు ప్రజలంతా బలి అవుతున్నారు.కాంగ్రెస్ పార్టీ విభజన చేసి తప్పు చేసిందని ప్రచారం చేసే చంద్రబాబు నాయుడు తాను ఓటుకు నోటు కేసు నేరానికి పాల్పడి అంతకన్నా పెద్ద తప్పు చేశారు. ఆ తప్పు చేసినా ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ తో రాజీ కుదుర్చుకుని సేఫ్ గా హైదరాబాద్ నుంచి బయటపడిపోయారు. కాని ఆ తప్పుకు బలైపోయింది ఆంద్ర సామాన్య ప్రజలు.నిరుపేద, మధ్యతరగతి వారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు తెలుసుకుని హైదరాబాద్ లో ఏ చికిత్స చేయించుకున్నా ఎన్.టి.ఆర్.ఆరోగ్య సేవ వర్తించేలా చర్యలు తీసుకుంటే మంచిది.

tags : ap, arogyasri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info