A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆఫ్టరాల్ పోటోగ్రాఫర్ మంత్రి అన్న టిడిపి..
Share |
January 18 2018, 5:36 am

బిజెపి మంత్రి మాణిక్యాలరావుకు, తాడేపల్లి గూడెం తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ కు మద్య మాటల తగాదా కొనసాగుతోంది.ఒక చర్చలో పాల్గొన్న బొలిశెట్టి మంత్రిని ఉద్దేశంఇచి ఆఫ్టరాల్ పోటోగ్రాఫర్ అని అనడం పెద్ద వివాదంగా మారింది.అయితే తాను మంత్రి మాణిక్యాలరావును ఆఫ్ట్రాల్‌ ఫొటోగ్రాఫర్‌ అని అనలేదని, ఆఫ్టర్‌ ఫొటోగ్రాఫర్‌ మంత్రి అని మాత్రమే అన్నానని ఆయన వివరణ ఇస్తున్నారు.తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. మంత్రే తమను ఉద్దేశించి ఆఫ్ట్రాల్‌ కౌన్సిలర్లు అని ఎద్దేవా చేశారని పేర్కొన్నారు.దీనిపై మంత్రి స్పందిస్తూ,‘నన్ను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశాడు. అవును నేను ఆఫ్ట్రాల్‌ ఫొటోగ్రాఫర్‌నే. నేను ఈరోజుకీ ఫోటోగ్రాఫర్‌ననే అందరికీ చెప్తా. 24 గంటల్లో 18 గంటలు పనిచేసే నిరంతర శ్రామికుడిని. కష్టపడ్డావోడు సిగ్గుపడక్కర్లేదు, కన్నాలేసేవాడే సిగ్గుపడాలి. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఏంటో తెలిసుకో, అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

tags : manikyalarao, chairman

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info