A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
24 గంటల ఉచిత కరెంట్ వద్దన్న ఎర్రబెల్లి
Share |
January 18 2018, 5:35 am

తెలంగాణలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వవద్దని సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు.వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇవ్వడం వల్ల బావులు ఎండిపోయే ప్రమాదముందని, 12 గంటల కరెంట్‌ చాలు అని ఆయన మంత్రి హరీష్ రావు సమక్షంలో వ్యాఖ్యానించారు. దానికి హరీ్ష్ రావు బదులు ఇస్తూ ‘మీకు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంట లు విద్యుత్‌ ఇస్తాం. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే పరిశీలిస్తాం అని సమాధానం ఇచ్చారు. హరీశ్‌ మాట్లాడుతూ హైటెక్‌ సిటీలో ఎంత నాణ్యమైన కరెంట్‌ ఉందో అదే కరెంట్‌ గ్రామాలకూ వస్తుందన్నారు. ‘తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రం చీకటిగా మారుతుందని కాంగ్రెస్‌ వాళ్లు అన్నారు. కానీ, నేడు సాగుకు 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామని హరీష్ రావు తెలిపారు.

tags : errabelli, power,supply

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info