A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నేతలకు మంత్రి కెటిఆర్ సలహా
Share |
September 20 2018, 12:23 am

కాంగ్రెస్ నేతలకు తెలంగాణ మంత్రి కెటిఆర్ ఒక సలహా ఇచ్చారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని భావిస్తుంటే కోర్టుకు వెళ్లండని ఆయన సూచించారు.వాటికి సంబందించిన ఆదారాలు ఉంటే కోర్టులో ఇవ్వవచ్చని ఆయన అన్నారు. నోరుంది కదా అని అడ్డంగా ఏది పడితే అది మాట్లాడడం సబబు కాదన్నారు. జైలుకెళ్లి చిప్పకూడు తిన్నవారు కూడా నీతి గురించి మాట్లాడితే ఎలా? అని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవ చేశారు.
అవినీతి నాయకుడి సవాళ్లకు తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరాతో రైతులు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ఈ పథకం విజయవం తం కావడంతో కాంగ్రెస్‌ కడుపు మండుతోం దన్నారు. ఇక ఎప్పటికీ అధికారంలోకి రాలేమన్న భయంతో కాంగ్రెస్‌ రగిలిపోతోంద ని ఆయన వ్యాఖ్యానించారు.

tags : ktr, suggestion,congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info