A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఖ/ష్భు భర్ద మద్దతు రజనీకాంత్ కే
Share |
January 18 2018, 5:14 am

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు సినీ రంగంలో మద్దతు పెరుగుతోంది. ప్రముఖ దర్శకుడు సుందర్‌.సీ. రాజకీయాలలోకి వచ్చిన రజనీకాంత్ కు తన మద్దతు ప్రకటించారు. ఒక సినీ కార్యక్రమంలో ఆయనను దీని గురించి ప్రశ్నించారట. మీరు రజనీకాంత్, కమలహాసన్‌లతో పలు చిత్రాలు తెరకెక్కించారు. వారిద్దరూ ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. వారిలో మీ మద్దతు ఎవరికి అన్న ప్రశ్నకు కచ్చితంగా తన మద్దతు రజనీకాంత్‌కే అని చెప్పడం విశేషం.. ఉళ్లతైఅల్లితా, అరుణాచలం, అన్భేశివమ్, అరణ్మణై ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన సక్సెస్‌ఫుల్‌ దర్శక నిర్మాతగా ఉన్నారు. నటి, కాంగ్రెస్‌ పార్టీ ప్రచార ప్రతినిధి కుష్బూ భర్త అయిన సుందర్‌.సీ నటుడు రజనీకాంత్, కమలహాసన్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం

tags : rajani,sundar support

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info