A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ రైతులకు ధరణి పాస్ పుస్తకాలు
Share |
January 18 2018, 5:00 am

తెలంగాణలో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూమి రికార్డుల క్షాళన చేపట్టామని ఆయన చెప్పారు. కొత్త పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి దేశ రాష్ట్రపతి లేదా ప్రధాన మంత్రిని ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు.. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమం తర్వాత భూమి వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని, ఈ వివరాలతో కూడిన పాస్ పుస్తకాలు కొత్తగా ప్రింట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇవే వివరాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో పెడతామన్నారు. కోర్ బ్యాంకింగ్ తరహాలో ల్యాండ్ వెబ్ సైట్ నిర్వహిస్తామని, దీనికి ‘ధరణి’ అనే పేరును ఖరారు చేశామన్నారు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నామని, పూర్తి స్థాయి సంస్కరణలతో వస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని మార్చి 11 నుంచే అమలు చేస్తామని కెసిఆర్ వివరించారు.

tags : kcr,land records

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info