A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెజాన్ సిఇఓ భూరీ విరాళం
Share |
December 12 2018, 8:20 am

అమెరికాలో బాగా సంపాదించేవారు కాదు..బాగా దానం చేసేవారు కూడా ఉన్నారు. అమెజాన్ సిఇఓ అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ భారీ విరాళం ఇస్తున్నారు. నాన్‌-ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ దిడ్రీమ్‌.యూఎస్‌కు 33 మిలియన్‌ డాలర్లను అంటే భారత కరెన్సీలో 209కోట్ల రూపాయలను విరాళంగా అందించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని శరణార్థ విద్యార్థులకు కాలేజీ స్కాలర్‌షిప్‌లుగా అందించనున్నారు. జెఫ్‌ బెజోస్‌, ఆయన భార్య మెకంజీ అతిపెద్ద విరాళం అందించారని దిడ్రీమ్‌.యూఎస్‌ తెలిపింది. వెయ్యి స్కాలర్‌షిప్‌లకు ఈ నిధులను వాడనున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు తాము అందుకున్న వాటిలో ఇదే పెద్ద మొత్తమని చెప్పింది. 105 బిలియన్‌ డాలర్లతో జెఫ్‌ బెజోస్‌ ఇటీవలే ప్రపంచ కుబేరుడయ్యారు. ఈ ఏడాది తొలి ఆరు ట్రేడింగ్‌ రోజుల్లోనే బెజోస్‌ 6.1 బిలియన్‌ డాలర్లను ఆర్జించినట్టు బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్‌ ఇండెక్స్‌ రిపోర్టు చేసింది. మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ను దాటేసి బెజోస్‌ ఈ స్థానాన్ని పొందారు.

tags : america, donation, amazon,ceo

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info