A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఏమి సాధించారో చెప్పాలి
Share |
December 12 2018, 9:31 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదాని మోడీతో సమావేశం అయి ఏమి సాదించారో చెప్పాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.వారిద్దరి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో ప్రజలకు తెలియచేయాలని ఆయన అన్నారు.గతంలో చెప్పిన విషయాలనే చంద్రబాబు మళ్లీ చెబుతున్నారని,ఆయన తీరు పాడిందే పాడరా అన్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు తెన్నులను ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు.రాష్ట్రానికి లక్షా ఇరవై వేల కోట్ల అప్పు తప్ప సాధించింది ఏమీ లేదని బొత్స అన్నారు.

tags : botsa, chandrababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info