A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముద్దుల యాత్ర వ్యాఖ్యపై వైసిపి మండిపాటు
Share |
December 10 2018, 9:46 am

విపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రను ఎపి ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ ముద్దుల యాత్ర అని వ్యాఖ్యానించడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ కడప ఎమ్మెల్యే అమ్ జాద్ భాష మండిపడ్డారు. మంత్రికి తల్లికి, చెల్లికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే బీరును హెల్త్‌ డ్రింక్‌గా వర్ణించిన మంత్రి నుంచి ఇంతకంటే మాటలు ఆశించలేమని భాషా వ్యాఖ్యానించారు.ఇలాంటి వ్యక్తి ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. అక్రమంగా, అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం మినహా ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు అర్జీలు ఇచ్చి ఇచ్చి విసిగిపోయారన్నారు.

tags : amzad bhasha, jawahar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info