A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్ షా కేసు-సుప్రింకోర్టులో చిచ్చు వెనుక..
Share |
June 23 2018, 9:04 pm

సుప్రింకోర్టు జడ్జిల తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితులపై పలు కధనాలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది బిజెపి అద్యక్షుడు అమిత్ షా కు లింకు ఉన్న షొహ్రబుద్దీన్ కేసు ప్రముఖంగా మీడియాలో వస్తోంది.షహ్రబుద్దీన్ ను గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారన్నది అభియోగం.ఇదే కేసులో గతంలో అమిత్ షా జైలుకువెళ్లవలసి వచ్చింది. ఆ తర్వాత ఈ కేసు విచారణను చేపట్టిన ముంబై జడ్జి లోయా అనుమానాస్పద స్థితిలో మరణించారు.ఆయన గుండెపోటుకు గురయ్యారన్నది ఒక వాదన కాగా,అది అనుమానాస్పదం అన్నది మరో వాదన.దీనిపై విచారణ చేపట్టడానికి హైకోర్టు అంగీకరించలేదు.కాని కార్వాన్ పత్రికలో ఈ జడ్జి మరణంపై సవిస్తరమైన కధనం వచ్చింది.దాని ఆదారంగా మళ్లీ విచారణకు పిటిషన్ లు దాఖలయ్యాయి. వాటిపై విచారణకు ముంబై హైకోర్టు సిద్దమైంది.ఈ తరుణంలో ఈ కేసు వ్యవహారం సుప్రింకోర్టుకు వచ్చింది. ఈ కేసును ఛీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం నాడు పరిశీలించింది.ఆ తర్వాత శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారంనాడు లిస్టింగ్స్‌లో ఈ కేసును - జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఎం శంతనగౌదార్‌లతో కూడిన బెంచ్‌కు కేటాయించడం వివాదాస్పదం అయింది. ఇది సీనియర్‌ జడ్జీలకు ఆగ్రహం కలిగించినట్లు సమాచారం.. రాజకీయంగా కీలకమైన కేసుల విచారణలో తమను ఎందుకు బైపాస్‌ చేస్తున్నారో చెప్పాలని జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ ప్రభృతులు ఛీఫ్‌ జస్టిస్‌ ను ప్రశ్నించినట్లు సుప్రీంకోర్టు వర్గాల కథనం. అయితే రోస్టర్‌ అంతా ప్రధాన న్యాయమూర్తి చేతిలోనే ఉంటుంది కాబట్టి వీరి ప్రశ్నకు సమాధానం దొరకలేదని తెలుస్తోంది. ఆ తరువాత కొద్ది గంటలకే- జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇంట్లో ఈ నలుగురు జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించారని మీడియా కదనం.

tags : supremecourt, amit shaw

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info