A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుప్రింకోర్టు సంక్షోభం- రాహుల్ వ్యాఖ్య
Share |
December 15 2018, 1:16 am

సుప్రిం కోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ స్పందించారు.ఇలా న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం మునుపెన్నడూ లేని అసాధారణ చర్య అని, జడ్జీలు లేవనెత్తిన అంశాలను సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రభుత్వానికి సూచించారు. న్యాయమూర్తులు వెల్లడించిన అంశాలు తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని, ఈ విషయంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని ఆయన అబిప్రాయపడ్డారు.సోహ్రాబుద్దీన్‌ కేసును విచారిస్తున్న సీబీఐ జడ్జి లోయ అనుమానాస్పద మృతి కేసును సరిగ్గా విచారించాల్సిన అవసరముందని, ఈ కేసులో స్వతంత్ర విచారణ జరగాలని అన్నారు. దేశ ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని, వారందరూ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు.

tags : rahul , supremecourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info