A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముక్కుకు నేలకు రాస్తా అంటున్న రేవంత్
Share |
September 19 2018, 8:17 am

తెలంగాణలో కరెంటు కొనుగోళ్లపై మరోసారి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణలు కురిపించారు.అందులో అవినీతి రుజువు చేస్తానని,లేకుంటే అబిడ్స్ లో ముక్కు నేలకు రాస్తానని ఆయన సవాల్ చేశారు. . విద్యుత్‌ కొనుగోళ్లపై బహిరంగ చర్చకు రావాలంటూ టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరిన రేవంత్‌రెడ్డి గన్‌పార్కు వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే సంపత్ కుమార్, నాయకులు కార్తీక్ రెడ్డి, రవీంద్ర నాయక్, జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.విభజన సమయంలో తెలంగాణకు 53.89శాతం విద్యుత్ కేటాయింపు ఘనత సోనియాదేనని రేవంత్‌ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.తాను బహిరంగ చర్చకు సవాల్ విసరగా టిఆర్ఎస్ నేతలు తోక ముడిచారని ఆయన అన్నారు.గతంలో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ పొందిన సంస్థ నుంచి తనపత్రికలో పెట్టుబడులు కెసిఆర్ పెట్టించారని ఆ విషయం తానే బయటకు తీసుకు వచ్చానని రేవంత్ అన్నారు.

tags : revanth, power scam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info