A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తిరుమలేషునిపై కనిమొళి వ్యాఖ్యలు-నిరసన
Share |
June 19 2018, 12:15 pm

తిరుమలేషునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డి.ఎమ్.కె. ఎమ్.పి కనిమొళిపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. హిందువుల మనో భావాలు దెబ్బతినేలా కనిమొళి మాట్లాడారని ఆమెపై కేసు నమోదుచేయాలని టిటిడి మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
కనిమొళి వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. 295ఏ, 120బీ, 34 సెక్షన్ల ప్రకారం ఆమె శిక్షార్హురాలని, తక్షణం ఆమెపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పిని కలిసి విజ్ఞప్తి చేశారు. పోలీసులు స్పందించకపోతే తాము ప్రైవేటు కేసు వేస్తామని ఆయన చెప్పారు. తన హుండీనే కాపాడుకోలేని వాడు ప్రజలను ఏం కాపాడగలడని కనిమొళి అనడం ఆమె దురహంకారానికి నిదర్శనమని తెలుగ సమ్మేళనంనేత సత్యాదేవి అన్నారు. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయం కూడలిలో కనిమొళికి సద్బుద్ధిని ప్రసాదించాలని ప్లకార్డులను ప్రదర్శించి వాటిని దహనం చేశారు.

tags : kanimozi,tirumala

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info