A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీతో చంద్రబాబు భేటీ
Share |
December 15 2018, 1:21 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పెండింగులో ఉన్న విభజన చట్టం హామీలను పరిష్కరించాలని మోడీని కోరామని ఆ తర్వాత చంద్రబాబు మీడియాకు చెప్పారు. పదిహేడు పేజీల వినతిపత్రాన్ని ఆయన ప్రధానికి సమర్పించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించి ఏభై ఎనిమిది వేల కోట్ల అంచనాలను ఆమోదించడంతో సహా, రాజదాని నిర్మాణానికి బడ్జెట్ లో నిదులు కేటాయించడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.
రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచాలని కోరారు. కాగా ఇంతవరకు పోలవరం పై పన్నెండు వేల కోట్లు తాము ఖర్చు చేశామని,అందులో మూడు వేల కోట్లు రావాల్సి ఉందని ఆయన వివరించారు.కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, విధి విధానాలు ఖరారు చేసి, నోటిఫికేషన్‌ జారీ చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని విన్నవించారు.ఎపికి సంబందించి వివిధ ఇతర అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.ఏడాదిన్నర తర్వాత ప్రధానితో చంద్రబాబు భేటీ కాగలిగారు.

tags : babu, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info