A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఎం, సిపిఐలు వేర్వేరుప్రంట్ లలో
Share |
December 15 2018, 12:21 am

తెలంగాణలో బహుజన వామపక్ష కూటమి ఏర్పడింది. ఆ కూటమి కన్వీనర్ గా సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యవహరించనున్నారు. ఈ ప్రంట్ తరపున తెలంగాణలోని 118 సీట్లకు పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు.ఎంసీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, బహుజన ఫ్రంట్‌, ఎంబీటీ, మహాజన సమాజం తదితర 28 పార్టీలు ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. ఈ నెల 25న భారీగా ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో నిర్వహించడానికి సంకల్పించారు. సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అంబేడ్కర్‌ మనుమడు ప్రకాష్‌ అంబేడ్కర్‌, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తమ్మినేని విలేకర్లతో మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. సీపీఐ, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్ష పార్టీలను కూడా కూటమిలోకిఆహ్వానిస్తున్నామన్నారు. సమావేశంలో కంచ ఐలయ్య, గద్దర్‌, కాకి మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.సిపిఎం ఈ ప్రంట్ కు నాయకత్వం వహిస్తుంటే, సిపిఐ మరో ప్రంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విస్తృత స్థాయిలో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు.

tags : telangana, fronts,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info