A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెక్కులే ఇవ్వండంటున్న తెలంగాణ రైతులు-సర్వే
Share |
December 12 2018, 9:45 am

ఖరీఫ్‌ 2018 నుంచి రైతులకు సాగుకు పెట్టుబడిగా అందించనున్న సహకారాన్ని ఏ రూపంలో అందిస్తే రైతులకు ఎక్కువ ప్రయోజనకరం అనే విషయంపై వ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో రైతులతో 09 జనవరి 2018న సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, ఐ.ఎ.ఎస్‌. విశ్లేషిస్తూ వివరాలను తెలియజేశారు.
ఈ సర్వే 30 జిల్లాలకు చెందిన 551 మండలాల్లోని 624 గ్రామాల్లో జరిగింది. సర్వేలో వివిధ గ్రామాలకు చెందిన 62,677 మంది రైతులతో సంభాషించారు. ఖరీఫ్‌ 2018 నుండి సాగుకు అందించనున్న పెట్టుబడి సహకారాన్ని ఏరూపంలో అందిస్తే బాగుంటుందని రైతులను అడగగా వారు సూచించిన ప్రాధాన్యతల క్రమం ఈ విధంగా ఉంది.
 చెక్కు రూపేణా సాగు పెట్టుబడి సహకారాన్ని అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డవారు - 31.58 శాతం మంది,
(జిల్లాల వారీగా చూస్తే సర్వేలో పాల్గొన్న రైతులలో మేడ్చల్‌ 63.8 శాతం మంది, నిజామాబాద్‌ 57.1 శాతం
మంది, అదిలాబాద్‌ 50 శాతం మంది, 40 శాతానికి పైగా ఈ పద్ధతిని కోరిన జిల్లాల్లో కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల్‌,
సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులు ఉన్నారు.)
 తమకున్న బ్యాంకు ఖాతాల్లో సాగుకు పెట్టుబడిగా అందిస్తున్న మొత్తాన్ని జమచేస్తే బాగుంటుందని - 27.55
శాతం మంది,
(బ్యాంకు ఖాతాల్లో వేయమని అభిప్రాయపడిన రైతుల వివరాలను జిల్లాల వారీగా చూస్తే - వరంగల్‌ అర్బన్‌ 81.55
శాతం మంది, రాజన్న సిరిసిల్ల 62.38 శాతం మంది, వరంగల్‌ రూరల్‌ 49 శాతం మంది, జనగాం 44.94 శాతం మంది
ఉండగా 30 శాతానికి పైగా కోరిన జిల్లాల్లో నిర్మల్‌, మంచిర్యాల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మెదక్‌, నల్గొండ,
జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల రైతులు ఉన్నారు)

 నగదు రూపంలో సాగుకు పెట్టుబడి సహకారాన్ని అందిస్తే బాగుంటుందని - 26.59 శాతం మంది,
(నగదు రూపంలో సహకారాన్ని అందజేయమని అభిప్రాయపడిన రైతుల వివరాలు జిల్లాల వారీగా చూస్తే -
ఆసిఫాబాద్‌ 62.17 శాతం మంది, వికారాబాద్‌ 48 శాతం మంది, జోగులాంబగద్వాల 46.08 శాతం మంది, రంగారెడ్డి 42
శాతం మంది కోరగా 30 శాతానికి పైగా నగదు రూపంలో కోరిన జిల్లాల్లో మహబూబ్‌నగర్‌, వనపర్తి, నల్గొండ, యాదాద్రి
భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల రైతులు ఉన్నారు)
 పోస్టాఫీసుల ద్వారా సాగు పెట్టుబడి సహకారాన్ని అందిస్తే బాగుంటుందని - 6.81 శాతం మంది,
సాగుపెట్టుబడి సహకారాన్ని ప్రీ లోడెడ్‌ కార్డ్‌ / సహకార విలువకు సమానమైన కార్డుల రూపంలో చెల్లిస్తే బాగుంటుందని -
6.44 శాతం మంది,
 చివరగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సాగుకు పెట్టుబడి సహకారాన్ని అందిస్తే బాగుంటుందని
- 1.03 శాతం మంది అభిప్రాయపడ్డారు.
సూచించిన ఆరు పద్ధతులలో దాదాపు 60 శాతం రైతులు సాగుకు పెట్టుబడి సహకారాన్ని చెక్కు రూపేణా గానీ,
తమ బ్యాంకు ఖాతాల్లో జమచేయడానికి గానీ మొగ్గు చూపారు.

tags : survey,cash

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info