A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దళితులపై దాడిచేసే బిజపి నేతలు దేశదరోహులు
Share |
January 18 2018, 5:19 am

బిజెపిపై సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుదాకరరెడ్డి సీరియస్ కామెంట్ చేశారు.దళితులపై దాడులకు పాల్పడే బిజెపి నేతలంతా దేశద్రోహులని ఆయన విమర్శించారు.తాను కావాలనే ఈ మాట అంటున్నానని ఆయన పేర్కొన్నారు.విజయవాడ జింఖానా గ్రౌండ్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలు, బీజేపీ వ్యతిరేకులపై దాడులు పెరిగిపోయాయని ఆయన అన్నారు. అవినీతి, అరాచక, మతోన్మాద, ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్న మోదీని గద్దె దించేందుకు లౌకిక, వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమవ్వాలన్నారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీసి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున వారి ఖాతాల్లో వేస్తామన్న బీజేపీ ఇప్పటి వరకూ మొత్తం రూ.15 లక్షల నల్లధనాన్ని కూడా వెలికి తీయలేకపోయిందని ఎద్దేవాచేశారు.

tags : suravaram, dalits,bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info