A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం టెండర్లు వాయిదా-పిపిఎ పై చేయి
Share |
January 18 2018, 5:27 am

పోలవరం ప్రాజెక్టు అంతా తానే చేస్తున్నట్లుగా కలర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బ్రేక్ పడినట్లుగాఉంది.పోలవరం అదారిటీ చేతికి పగ్గాలు వచ్చినట్లుగా ఉంది. రాష్ట ప్రభుత్వం కొత్త టెండర్లను పోలవరం అదారిటీ వారం రోజులపాటు వాయిదా వేసి వివిధ అంశాలపై చర్చించింది. ఈ నెల 18 తేదీ వరకూ టెండర్ల గడువును పొడిగించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 16 తేదీన మరోమారు భేటీ కానున్న పీపీఏ టెండర్లపై వివిధ అంశాలను పరిశీలించాలని నిర్ణయించింది. 2018నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతూ వచ్చేవారు కొద్ది రోజుల క్రితం ఆయన దానిని 2019 అనడం ఆరంబించారు.దానికి తగ్గట్లుగా పోలవరం అధారిటీ సిఇఓ హల్దార్ కూడా 2019 కి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని చెప్పడం విశేషం. అదే సమయంలో ఆయన ఒక మాట అన్నారు.ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్పిల్ వే పనులు పూర్తి చేస్తేనే అది సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న స్పిల్ వే పనులు అంత ఆశాజనకంగా లేవని అనడం గమనించవలసిన అంశంగాఉంది.

tags : polavaram, tenders

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info