A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నన్ను అంటరానివాడిగా చూస్తారా-ఎపి బిజెపి మంత్రి
Share |
September 19 2018, 11:46 pm

ఇంతకాలం అవమానాలు భరిస్తూ మంత్రి పదవిలో కొనసాగుతున్న బిజెపి నేత మాణిక్యాలరావు ఒక్కసారే భగ్గుమనడం విశేషం.ఆయనకు పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గానికి మధ్య విబేధాలుఉన్న సంగతి తెలిసిందే. మంత్రిని ముళ్లపూడి వర్గం అసలు గుర్తించదు.దాంతో మంత్రి జన్మభూమి సభలో మాట్లాడుతూ ‘ఈ రాష్ట్రంలో నిరంతరం ముఖ్యమంత్రి పక్కన కూర్చొనే వ్యక్తిని. నాకు.. నా ఊరికి.. నా నియోజకవర్గానికి వచ్చే నిధుల్ని.. నా ద్వారా చేసే పనులను నువ్వు ఆపడానికి ప్రయత్నిస్తే నేను మగాడినో.. కాదో తేల్చుకుంటా’ అని బాపిరాజునుద్దేశించి వ్యాఖ్యానించారని కధనం వచ్చింది. ‘మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా నన్ను పిలిచారా? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నేను వైసీపీ నుంచి వచ్చానా? ఊళ్లో ఏదైనా రోడ్డు వేసి.. నా రోడ్డుపై నడవద్దంటే ఎదుటివాడు వచ్చి తంతాడు. ఎవరెవరికైనా ఓటు వేసుకోవచ్చు..’ అంటూ మధ్యలో మంత్రి బూతు పదం వాడారు. ఎవరినో వదిలేయండి. నన్నే అంటరానివాడిగా చూసే దౌర్భాగ్య పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటరానితనం గురించి కథల్లో చదివాను. నా నియోజకవర్గంలో నన్ను అంటరానివాడిగా చూస్తున్నారని ఆయన వాపోయారు. తనను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా. నన్ను కట్‌ చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్‌ చేస్తా.. చాలా స్పష్టంగా చెబుతున్నా, సహనానికి హద్దులు ఉంటాయి అని మాణిక్యాలరావు ఘాటుగా రియాక్ట్ అయిన తీరు తీవ్ర కలకలం రేపుతోంది.

tags : manikayalarao, speech

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info