A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అందువల్లే నన్ను ఏమీ చేయలేకపోయారు- చంద్రబాబు
Share |
September 19 2018, 8:36 am

తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా, క్రమశిక్షణగా వ్యవహరించానని , అందువల్లే తనను ఏమీ చేయలేకపోయారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానింఆరు.కోర్టుకు వెళ్లేవారు తనను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.పశ్చిమ గోదావరి జిల్లాకు అన్యాయం చేయబోనని ఆయన చెప్పారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 2 లక్షల మందికి ఉపకరణాలను ఇవ్వబోతున్నామని వెల్లడించారు. సేవా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయని, ఆ దిశగా యువతను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

tags : chandrababu, honest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info