A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అజ్ఞాతవాసి రికార్డు బ్రేక్ చేసిందా
Share |
June 23 2018, 9:01 pm

ప్రముఖ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి అమెరికాలో రికార్డు బ్రేక్ చేసిందని ఈనాడు పత్రిక ఒక కధనం ఇచ్చింది . ఆ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.మీరూ చదవండి.ఈనాడు కదనం ఇలా ఉంది.
.................



పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా బుధవారం విడుదలై, మంచి టాక్‌ అందుకుంది. మంగళవారం అమెరికాలో విడుదలైన ఈ సినిమా అక్కడి బాక్సాఫీసు వద్ద ‘బాహుబలి’, ‘ఖైదీ నంబర్‌ 150’ రికార్డులను బ్రేక్‌ చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. ప్రీమియర్‌ షోల ద్వారా దాదాపు 1.40 మిలియన్ల డాలర్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.

‘అజ్ఞాతవాసి’ విదేశీ పంపిణీ హక్కులను ఎల్‌ఏ తెలుగు సంస్థ రూ.19.50 కోట్లకు కొనుగోలు చేసిందట. డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం అక్కడ ప్రీమియర్‌ షోల కోసం 600 స్క్రీన్లను బుక్‌ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా టికెట్‌లకు అమెరికాలో భారీ డిమాండ్‌ నెలకొంది. సినిమా కేవలం ప్రీసేల్స్‌ ద్వారా మిలియన్‌ డాలర్లు రాబట్టడం విశేషం.

‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలు అమెరికా ప్రీమియర్‌ షోలలో వరుసగా 1,005,630 డాలర్లు, 1,295,613 డాలర్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. ఈ కలెక్షన్స్‌ను 1,464,647 డాలర్ల వసూలుతో ‘అజ్ఞాతవాసి’ బీట్‌ చేసింది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తిసురేశ్‌ కథానాయికలు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ, రావు రమేశ్‌, మురళీశర్మ ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్‌ ఈ సినిమా ద్వారా తొలిసారి తన బాణీలను నేరుగా తెలుగు ప్రేక్షకులకు వినిపించారు.

tags : america, ajnana vasi

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info