A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతిభ ఉంటేనే అమెరికాకు వలస
Share |
December 15 2018, 12:56 am

అమెరికాలోకి వసల వచ్చే వారికి మంచి ప్రతిభా పాటవం ఉండాల్సిందేనని అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అబిప్రాయపడ్డారు. గొలుసుకట్టు వలసలు,అంటే ఒకరి తర్వాత వారికి సంబందించిన వారు అమెరికాలోకి వచ్చే పద్దతి సరికాదని ఆయన అన్నారు.అయితే కెనడా ఆస్ట్రేలియా లో మాదిరి ప్రతిభ ప్రాతిపదికన వలస విదానం ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు.
వలసలకు సంబంధించి ప్రవేశపెట్టే ఏ బిల్లులో అయినా ‘ప్రతిభ’ అనే పదాన్ని ఉపయోగించాలని అనుకుంటున్నాని ఆయన చెప్పారు. ట్రంప్ ను రెండు పార్టీల ప్రముఖులు కలిసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు వారు కూడా మద్దతు తెలిపారు.గొలుసు కట్టు విదానంలో వచ్చిన వారితో అమెరికాకు పెద్ద ప్రయోజనం ఉండడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.

tags : trump, immigration

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info