A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
Share |
September 20 2018, 12:08 am

పోలవరం ప్రాజెక్టుకు అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిమాండ్ చేసింది.ఇందులో ఎలాంటి రాజీ లేదని,,ప్రాజెక్టు వ్యయ అంచనాలలో పెరిగిన భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేయరాదని స్పష్టం చేసింది.విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆద్వర్యంలో కూడేరు వద్ద పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల గందరగోళంలో పడిన పోలవరం అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని సూచించారు. అంతేకాదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విశాఖ రైల్వేజోన్‌తోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ డిమాండ్‌ చేయాలన్నారు.పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, పి.వి.మిథున్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పాల్గొన్నారు.

tags : mekapati, polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info