A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
Share |
June 20 2018, 10:50 pm

ఎపి ప్రభుత్వం పట్టిసీమ పేరుతో గొప్పలు ప్రచారం చేసుకోవడం ఆ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసేలా కనిపిస్తోంది. పట్టిసీమతో వందల టి.ఎమ్.సి.ల నీటిని తరలించేశామని, అయినా,కాకపోయినా ఎపి ప్రభుత్వం ప్రజలను నమ్మించడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటుంది. దాని ఆదారంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దాని ఆదారంగా కృష్ణ జలాలలో కోత పెట్టాలని డిమాండ్ చేస్తోందన్న కధనం ఎపికి ఆందోళన కలిగించేదే.కృష్ణా నది నీటి కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల వాటాపై సోమవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలోని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌లో వాదనలు జరగనున్నాయి. ఏపీకి 155 టీఎంసీల నీటి వాటా సరిపోతుందని, ఆ రాష్ట్రానికి ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల వాటాలో కోత పెట్టాలని డిమాండ్‌ చేయనుంది. ఏపీ సమర్పించిన అఫిడవిట్‌పై ఈ మేరకు వేసిన రిజాయిండర్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా వాదించనుంది.కృష్ణా డెల్టా కింద ఏపీకి 152.20 టీఎంసీల కేటాయింపు ఉండగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాల భూసమీకరణ కారణంగా 16 టీఎంసీల మేర డిమాండ్‌ తగ్గుతుందన్నది తెలంగాణ వాదన. దీనికితోడు డెల్టా నీటి అవసరాలను తీర్చడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 114.37 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తోందని, భవిష్యత్తులో పోలవరం కుడి కాల్వ ద్వారా 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించనుందని చెబుతోంది.

tags : ap, telangana, water

Latest News
*మళ్లీ ప్యాకేజీ డబ్బులు అడిగిన చంద్రబాబు
*లోకేష్ మళ్లీ నవ్వులపాలయ్యారా
*జగన్ గ్రాఫ్ పెరుగుతోంది- దగ్గుబాటి
*అమెరికాలో తెలుగు సెక్స్ రాకెట్- సంచలనాలు
*లైసెన్స్ తుపాకీ ఇవ్వాలని కోరిన క్రికెటర్ భార్య
*ఆగస్టు నాటికి పట్టణాలలో మిషన్ భగీరధ
*బ్యాంకుల్లో సొమ్ము భద్రమే.ప్రైవేటులోనే డౌటు
*టిడిపికి కొత్త చిక్కు తెచ్చిన సర్వే-గంటా అలక
*కులాల రిజర్వేషన్ లపై కమిషన్ -ఎపి కొత్త అంకం
*వచ్చే ఎన్నికలలో అన్ని చోట్ల బిజెపి పోటీ- విష్ణురాజు
*కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం
*హైకోర్టుపై ఎపి ఇంకా స్పష్టత ఇవ్వలేదా
*రైతు బందు డబ్బుతో ప్రిజ్ లు, కుక్కర్లు
*ఆంద్రులకు అవమానం మిగిల్చిన చంద్రబాబు
*స్టీల్ ప్యాక్టరీ రాకుండా చేసిందే చంద్రబాబు
*టిడిపి అడ్డగోలు ఫిర్యాదు
*అనంతలో వైసిపి దీక్ష- చంద్రబాబుకు చెక్
*రమణ దీక్షితులపై వంద కోట్ల దావా
*చంద్రబాబే నీటిని వదలాలా...
*పవన్ పోరాట యాత్ర బ్రేకు ఎంతకాలం
*డాలస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
*సంక్రాంతి నాటికి వైఎస్
*పాపం ..ఉత్తం కుమార్ రెడ్డి..అప్రతిష్టేనా
*ప్రతిపక్షం పనిలేక విమర్శలు-విష్ణురాజు
*శ్రీశైలం,సాగర్- కేంద్రం కీలక నిర్ణయం
*ఈసారి 39 కోట్ల మొక్కలు నాటుదాం
*ఎల్.ఇ.డి.బల్లులతో 48 కోట్ల ఆదా
*చంద్రబాబు నాయీ బ్రాహ్మణులతో చేయి కలపరా
*కేంద్రంతో కెసిఆర్ లాలూచీ-టిడిపి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info