A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
Share |
September 20 2018, 12:42 am

ఎవరైనా ఒకే నియోజకవర్గం నుంచి పోటీచేయాలన్న అంశంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటిషనర్ వాదనతో ఎన్నికల సంఘం ఏకీభవించింది. దీనిపై తాము కేంద్రానికి లేఖ రాశామని, కాని సమాదానం రాలేదని ఎన్నికల సంఘం సుప్రికోర్టుకు తెలిపింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కేంద్రం తన అబిప్రాయం తెలయిచేయాలని సుప్రింకోర్టు ఆదేశించింది. ఒక నేత ఒకే చోట పోటీ చేసేలా చట్ట సవరణ చేయాలన్నది తమ అభిప్రాయమని, ఇప్పటికే కేంద్రానికి రెండుసార్లు లేఖ రాశామని ఎన్నికల సంఘం పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఎన్నికల సంఘం వివరించింది. కొందరు నేతలు రెండు చోట్ల ఎన్నికల బరిలో దిగడం, ఆ స్థానాల్లో విజయం సాధిస్తే ఓ స్థానానికి రాజీనామా చేస్తుంటారు. ఒకవేళ ఒకే స్థానంలో విజయం సాధిస్తే రాజీనామా అవసరం ఉండదు. అయితే ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణంలో ఒక్కోసారి ఈ ప్రతిపాదన ఇబ్బంది అవుతుందేమో!

tags : supremecourt,contest,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info