A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
Share |
January 19 2018, 4:47 am

మేము అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా మీ దొడ్లో ఉండే జంతువులతో అరిపిస్తారా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమీప బంధువు గిరిజనుడికి రావల్సిన ఉద్యోగాన్ని తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందారని ఆయన ఆరోపించారు. సుప్రింకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం అక్రమంగా రిజర్వేషన్ పొందినవారి నుంచి మొత్తం డబ్బు వసూలు చేయాలని ఆదేశించిందని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎస్టి సెల్ అధికారికంగా పిర్యాదు చేస్తుందని ఆయన చెప్పారు. కొడుకు తప్పు చేస్తే కూడా శిక్షిస్తానని చెప్పిన కెసిఆర్ గిరిజనుడికి రావల్సిన ప్రయోజనాన్ని కెసిఆర్ వియ్యంకుడు హరనాదరావు పొందారని,ముప్పైఐదేళ్లపాటు ఈయన లబ్ది పొందారని , ఆయనపై చర్య తీసుకుంటారా?లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమాచారం ప్రభుత్వం నుంచి అదికారికంగానే తీసుకున్నామని రేవంత్ అన్నారు.

tags : revanth, kcr, reservation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info