A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
Share |
September 20 2018, 12:46 am

ప్రముఖ నటుడు,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం లో చేసిన ప్రసంగాలలో ఆయా అంశాలపై క్లారిటీ ఇచ్చినట్లు కనిపించలేదు. ఆయన పరస్పర విరుద్దమైన విషయాలు మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఒక వంక విపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తానని బహిరంగంగా చెబితే, పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ పై కొంచెం పరోక్ష విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగించేదే. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారిపై కన్నా, ప్రతిపక్షంలో ఉన్నవారిపై విమర్శలు చేయడానికి ఆయన ప్రాదాన్యం ఇచ్చారా అన్న అనుమానం కలుగుతుంది.ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసినవారి సంగతి చూస్తానని పవన్ కళ్యాణ్ అనడం రాజకీయ అవగాహన లేమికి నిదర్శనంగా కనబడుతుంది.ప్రజారాజ్యం పార్టీకి ఎవరు ద్రోహం చేశారన్నదానిపై ఆయన కు ఎంత మేర స్పష్టత ఉందన్నది సందేహంగానే ఉంది. ప్రజారాజ్యం ను మెట్టుగా వాడుకుని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురికి మద్దతుగా పవన్ కళ్యాణే ప్రచారం చేశారు. చిరంజీవి కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రజారాజ్యం విలీనం చేయడం ద్రోహమా? లేక కాంగ్రెస్ పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్రోహమా?లేక అప్పట్లో కొందరు చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేసిన కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అత్యంత సన్నిహితంగా పదవులలో ఉన్నారు.ఉదాహరణకు అప్పట్లో ప్రజారాజ్యంలో ప్రుముఖుడిగా ఉన్న పరకాల ప్రభాకర్ పార్టీ ఆపీస్ లోనే చిరంజీవిని విమర్శించి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరిని దెబ్బతీస్తారో అర్దం కాదు.ఇక ముఖ్యమంత్రి చనిపోతే ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటారా అని పవన్ అడుగుతున్నారు. దానికే పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉంటే ఇప్పుడు చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ మంత్రి అయిపోయారు.ఆయన చంద్రబాబు వారసుడుగా ముఖ్యమంత్రి రేసులో ఉండరని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు.అలాగైతే పవన్ అమాయకుడనే అనుకోవాలి. అలా అనుకోకపోతే లోకేష్ ను ఎందుకు విమర్శించలేదు. చంద్రబాబును ఎందుకు తప్పు పట్టలేదు? అంతకు మించి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చిరంజీవి సోదరుడుగా పవన్ కళ్యాణ్ యువరాజ్యం అద్యక్షుడుగా ఉన్నారు. వీరి బావ అల్లు అరవింద్ కీలక బాద్యతలు చేపట్టారు.మరి ఇది కుటుంబ రాజకీయం కాదా అన్నదానికి పవన్ కళ్యాణ్ సమాదానం చెప్పవలసి ఉంటుంది. అంతేకాదు.చిరంజీవి నటుడు కాకపోతే పవన్ కళ్యాణ్ కు కాని, ఆయన కుటుంబంలో పలువురికి ఇన్ని అవకాశాలు వచ్చేవా అన్న ప్రశ్న కూడా వస్తుంది.అయితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కు సంబందించి ఆయన తీసుకున్న వైఖరి సరైనదే కావచ్చు.కాని అదే మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసిన సమస్య మాదిరి గా ఆయన డీల్ చేసినట్లుగాఉంది. ఆ సమస్యను తీసుకోవడం తప్పు కాదు. కాని అంతకు మించి తీవ్రమైన విషయాల గురించి పవన్ కళ్యాణ్ ఇంతకాలం ఎందుకు ప్రస్తావించలేదు?గోదావరి పుష్కరాల లో తొక్కిసలాటలో ఇరవైతొమ్మిది మంది చనిపోతే పవన్ ఎందుకు పరామర్శించలేదు? తొక్కిసలాట ఎందుకు జరిగంది? అసలు కేసు కూడా పెట్టకపోవడంలో తప్పు ఎవరిది?సిసిటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది?ఇవేవి పవన్ కళ్యాణ్ కు పెద్ద సమస్యలుగా కనిపించలేదనుకోవాలి. బోటు ప్రమాదం జరిగి ఇరవై మంది పైగా చనిపోతే ఇన్నాళ్ల తర్వాత స్పందించారు.అది కూడా ఎక్కడా ముఖ్యమంత్రి ,లేదా ప్రభుత్వం జోలికి పెద్దగా వెళ్లకపోవడం అంతా గమనించారు.అన్నిటికి మించి ప్రజాసవ్యామ్య వ్యవస్థకు పెద్ద వినాశకర అంశంగా మారిన
ఫిరాయింపులపై ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఒక్క మాట్లాడకపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది.కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం వంటి కీలక సంగతిని పవన్ కళ్యాణ్ పక్కనబెట్టేశారు.ఎపి ప్రభుత్వంలో అసలు అవినీతి జరగడం లేదని పవన్ బావిస్తున్నారా?లేదూ కొందరు అనుమానిస్తున్నట్లు చంద్రబాబు తరపున ఆయన ప్రత్యక్షంగానో,పరోక్షంగానో పనిచేస్తున్నారా?అందుకే ఆయనపై విమర్శలు చేయడానికి సందేహిస్తున్నారా?లేక ఇప్పుడే చంద్రబాబుతో తగాదా పెట్టుకుంటే తాను తట్టుకోలేనన్న భయంలో పవన్ ఉన్నారా?అన్నది కూడా కొందరు అంటుంటారు.ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బిజెపి తో కాస్త ఎడం అయినట్లే ఉన్నారు.కాని తెలుగుదేశం తో తన పయనం సాగించాలో ,లేదో తెలియని గందరగోళంలో ఉన్నారా అన్న అబిప్రాయం కలుగుతుంది.లేదా పోలవరం, కాపుల రిజర్వేషన్ విషయాలలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపద్యంలో వాటిని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ యాత్ర ఉపయోగపడితే అది ఆయనకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.ముఖ్యమంత్రి పదవి వద్దంటారు..పార్టీని రెండు రాష్ట్రాలలో విస్తరిస్తానని అంటారు.ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ముఖ్య నాయకుడు అయినా ఒక ప్రదాన లక్ష్యం పెట్టుకుంటారు. ఎంతపైకి చెప్పినా అదికారం సాదనకే పార్టీలు పనిచేస్తాయి.అలా కాదంటే అది హిపోక్రసి అవుతుంది.ఎపిలో సాగుతున్న పాలన గురించి కాని,ఆ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై కాని పవన్ కళ్యాణ్ స్పందించనంతకాలం ఆయనపై సందేహాలు కొనసాగుతాయి. పవన్ కళ్యాణ్ కు నిజంగానే టిడిపితో ఉండాలని ఉంటే ఉండవచ్చు.కాని కొన్నిసార్లు వారితో ఏదో కొద్దిగా విభేదించినట్లు కనిపించి ముఖ్యమైన సమస్యలను డైవర్టు చేయడానికి ఉపయోగపడితే పవన్ కళ్యాణ్ ప్రతిష్టను పణంగా పెట్టి రాజకీయం నడుపుతున్నారన్న విమర్శను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పక తప్పదు. ఏ విషయమైనా పవన్ కళ్యాణ్ లో గందరగోళం పోయి , క్లారిటీ ఎప్పటికైనా వస్తుందా అన్నది చర్చనీయాంశంమే.

tags : pawan kalyan, doubts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info