A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
Share |
September 20 2018, 12:47 am

ఇండియాలోని వివిద రాష్ట్రాలలో అవినీతి తగ్గలేదని ఒకసర్వే వెల్లడించింది.గత ఏడాది మాదిరిగానే అవినీతి కొనసాగుతోంది.ట్రాన్స్ పెరెన్సి ఇంటర్నేషనల్ సంస్థ సుమారు ముప్పై ఐదు వేల మందిని సర్వే చేయగా, నలభై ఐదు శాతం మంది తాము గత ఏడాది కాలంలో ఒకసారైనా లంచం ఇచ్చామని చెప్పారట.పశ్చిమబెంగాల్, మద్య ప్రదేశ్ లలో అవినీతి బాగా ఎక్కువగా ఉందని డెబ్బై ఒక్క శాతం మంది అబిప్రాయపడ్డారు. అయితే ఉత్తరప్రదేశ్ లో మాత్రం అవినీతి తగ్గిందని సర్వలో పాల్గొన్నవారు చెప్పడం విశేసం . 21 శాతం మందే అవినీతి ఉందని అన్నారు.డిల్లీలో సైతం అవినీతి తగ్గలేదని సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వ రంగంలో అవినీతి ఉందని తొమ్మిది శాతం చెప్పగా, స్థానికంగా మున్సిపాల్టీ, తదితర విభాగాలలో అవినీతిపైనే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు.

tags : india, coruption

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info