A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
Share |
January 19 2018, 4:50 am

సంస్కరణ ల గురించి పెద్ద కబుర్లు చెప్పే మోడీ ప్రభుత్వం ఇలా చేసిందా?అవసరమైతే ఎలాంటి త్యాగానికి అయినా సిద్దమేనని,మూల్యం చెల్లించుకుంటాకాని సంస్కరణల పై వెనక్కి తగ్గనని చెప్పిన ప్రధాని మోడీ ప్రభుత్వం డిసెంబర్ నెలలో వంట గ్యాస్ ధరలు పెంచకపోవడానికి కారణం గుజరాత్ ఎన్నికలట. దీనిపై మీడియాలో వచ్చిన కదనాలు ఆసక్తికరంగా ఉన్నాయి.గత 17 నెలల్లో ఆయిల్‌ కంపెనీలు వంట గ్యాస్‌ ధరను 19సార్లు పెంచాయి. అప్పటి ధరతో పోలిస్తే ప్రస్తుతం సిలిండర్‌పై రూ.76.5 పెరిగింది. కాని డిసెంబర్ లో మాత్రం ఆయిల్‌ కంపెనీలు వంటగ్యాస్‌ ధర జోలికి వెళ్లలేదు. గుజరాత్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డిసెంబరులో వంట గ్యాస్‌ ధరను పెంచలేదని చెబుతున్నారు. వంటగ్యాస్‌పై 2018 నాటికి ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తివేసే ఆలోచనలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అదికారులు సమాధానం దాటవేయడంతో అది నిజమేనన్న అబిప్రాయం కలుగుతోంది..

tags : gas, rates

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info