A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హామీల తీరుపై జగన్ సమాధానం
Share |
February 24 2018, 5:50 pm

తన పాదయాత్రలో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారన్న తెలుగుదేశం విమర్శలకు విపక్ష నేత జగన్ సమాధానం ఇచ్చారు..ఆయన మాటలలోనే

మీరు పాదయాత్రలో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారన్న ఆరోపణలో వాస్తవం ఏమిటి?

ఇవన్నీ కూడా నేను కొత్తగా ఈరోజు చెబుతున్నవి కాదు. నవరత్నాలు ప్లీనరీలో కొన్ని నెలల క్రితమే ప్రకటించాం. పాదయాత్రలో అవే పునరుద్ఘాటిస్తున్నా. వాటికి జత చేసింది అతి స్వల్పం. బహుశా కరెంటు విషయంలో 200 యూనిట్లు అంటూ కొంచెం పెంచామనుకుంటా. మిగతావన్నీ చిన్న చిన్న చేర్పులే. వైఎస్‌ భరోసా ఎంతవుతుంది? ఇవాళ రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంది. బహుశా మనం అధికారం లోకి వచ్చేసరికి బడ్జెట్‌ రూ. 1.80 లక్షల కోట్లకు చేరుతుంది. అంత బడ్జెట్‌లో ఇవి చాలా చిన్నవి. మేజర్‌గా చెప్పేవన్నీ ప్లీనరీలోనే చెప్పేశా. ఆరోజు ఎవరూ విమర్శలు చేయలేదు. ఇప్పుడు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఏదో అంటుండటం సహజమే.

45 ఏళ్లకే పింఛను అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
ధర్మవరంలో చేనేతల కష్టాలను చూసిన సందర్భంగా 45 ఏళ్లకే పింఛను అని హామీ ఇచ్చా. దాదాపు 35 రోజుల నుంచి వారు అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. 35 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు నేను వెళ్లిన రోజు రిలే దీక్షలో మహిళలు పాల్గొన్నారు. వాళ్ల కష్టాలను చూసి ఉద్వేగానికి లోనయ్యా. చేనేతలు, మత్స్యకారులు.... కూలికి వెళితే గానీ కడుపు నిండని పరిస్థితి. పొలాల్లో కూలి పనులు చేస్తూ కనిపించేది పేదవర్గాల అక్కచెల్లెమ్మలే. పనులకు వెళితే తప్ప కడుపు నిండని పరిస్థితి వీరిది. పనులు చేసి చేసి 45 ఏళ్ల వయసు వచ్చేసరికి వీరి పని సామర్థ్యం దారుణంగా తగ్గిపోతుంది. వీరు అనారోగ్యం వల్లో ఒంటినొప్పుల వల్లో పనులకు పోలేకపోతే పస్తుండాలి. ఇలాంటి వారికి 45 ఏళ్లకే రూ. 2,000 ఇవ్వడంలో తప్పేముంది? మనిషిలో ఆమాత్రం మానవతా దృక్పథం లేకపోతే నా దృష్టిలో మానవతకు, అమానవతకు తేడా ఏమీ లేనట్లే.

tags : jagan, promises

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info