A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చేశాయా
Share |
November 16 2018, 1:07 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రతిపక్ష నేత జగన్ కాని, ఇతర పక్షాల నేతలు కాని ఒక ప్రదాన విమర్శ చేస్తుంటారు. చంద్రబాబు చెప్పేవాటిలో అత్యధికం అబద్దాలు ఉంటాయని,ఆయన మోసాలు చేయడానికి పెద్దగా ఫీల్ కారన్నది ఆ విమర్శ సారాంశం.దానిని నిజం చేస్తున్నారా అన్న అనుమానం కలిగేలా ఆయన ప్రకటనలు కూడా కనిపిస్తుంటాయ.ఎపిలో ఈ మూడేళ్లలో 5.35 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ,ప్రైవేటు రంగాలలో జరిగిందని చెప్పేశారు.విశేషం ఏమిటంటే హైదరాబాద్ నగరం కలిగి ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇన్ని లక్షల ఉద్యోగావకాశాలు కల్పిచేశామని ఎన్నడూ చెప్పడానికి సాహసం చేయలేదు.కాని చంద్రబాబు మాత్రం ఎపిలో ఇంతవరకు ఒక్క ప్రధాన పరిశ్రమ వచ్చినట్లు కనిపించకపోయినా లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చెబుతున్నారు.మరో వైపు ఎపి కష్టాలలో ఉందని ఆయనే చెబుతుంటారు. మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని కూడా ఆయన నమ్మబలుకుతారు. అదే సమంలో కేంద్రం ఆదుకోకపోతే అది కాదు..ఇది కాదు అని చెబుతారు.వీటిలో ఏదో ఒకటి నిజం అయి ఉండాలి.నిజంగానే చంద్రబాబు చెప్పినట్లు ఐదు లక్షల కుపైగా ఉద్యోగాలు వచ్చి ఉంటే ఇక ఎపికి ప్రత్యేక హోదా అవసరం లేదు. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వవలసిన అగత్యం అంతకంటే ఉండదు. చంద్రబాబు మాదిరే ఆయన కుమారుడు కూడా ఉద్యోగాల విషయంలో లక్షల సంఖ్యలోనే చెబుతుంటారు.ఏడాదిలో లక్ష ఐటి ఉద్యోగాలో,రెండు లక్షల ఐటి ఉద్యోగాలో అని ప్రచారం చేస్తుంటారు.ఒకవైపు ఐటి రంగం ఒడిదుడుకులు ఎదుర్కుంటుంటే , లోకేష్ అయినా చంద్రబాబు అయినా ఎపిలో ఏదో జరిగిపోతోందని ప్రజలు భ్రమపడాలని భావిస్తుంటారు.నిజానికి ఎపిలో ఒక ప్రణాళిక ప్రకారం ఈపాటికి చర్యలు చేప్టటి ఉంటే నిర్మాణ రంగం ఊపు అందుకునేది.కాని చంద్రబాబు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినట్లు, తెలుగుదేశం నేతలకు మాత్రమే ప్రయోజనం కలిగే రీతిలో వ్యవహారాలు నడిపిన ఫలితమో ఏమో కాని, రాజధాని అమరావతి పేరుతో ఉన్న ప్రాంతంలోకాని, కృష్ణ,గుంటూరు జిల్లాలలో కాని భూముల రేట్లు దారుణంగా పడిపోయాయి.రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎంతో ఊపు వచ్చింది.కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.అందరి చూపు మళ్లీ హైదరాబాద్ వైపే మళ్లుతోంది.ఈ పరిస్థితులను కప్పిపుచ్చి ,ఉపాది అవకాశాలు ఎలా పెంచాలా అన్న ఆలోచన బదులు ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రజలు భ్రమపడాలన్నట్లుగా ప్రచారం చేపడుతున్నారు.ఇదంతా దేనికి?తెలుగుదేశం ఎన్నికల మానిఫెస్టోలో నిరుద్యోగులకు రెండువేల రూపాయల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.దానిని ఎలా ఇవ్వాలో,అందుకు డబ్బులు ఎక్కడ నుంచి తేవాలో తెలియక చంద్రబాబు కొత్తపల్లవి అందుకున్నారు.అసలు నిరుద్యోగ బృతి ఏ రాష్ట్రంలో సఫలం కాలేదని కొత్త విషయం చెబుతున్నారు.మరి అలాంటప్పుడు టిడిపి ఎన్నికల ప్రణాళికలో ఎందుకు పెట్టారో ఆయన చెప్పరు.ఇక భారీ గా అంకెలు ప్రచారం చేయడం ద్వారా జనం చెవుల్లో పూలుపెట్టవచ్చన్న నమ్మకం ఉండవచ్చు.రెండేళ్ల క్రితం విశాఖ పట్నం ప్రాంతంలో తుపాను వస్తే అరవైవేల కోట్ల నష్టం జరిగిందని ప్రచారం చేశారు.ఆ తర్వాత ఇరవై వేలు అన్నారు.పద్నాలుగువేల కోట్ల నష్టానికి నివేదిక ఇచ్చారు.తీవ్రమైన నష్టం జరిగిందని బిజెపి ప్రముఖుడి ద్వారా ప్రదానిమోడీకి చెప్పించి విశాఖ కు ఆయనను రప్పించారు.ఆయన వచ్చి వెయ్యికోట్ల రూపాయల సాయం ప్రకటించి ఆరువందల కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు.ఇంతవరకు చంద్రబాబు అన్నివేల కోట్లు ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని ప్రశ్నించలేదు.అంటే దానర్దం చంద్రబాబు ప్రభుత్వం అబద్దం చెప్పినట్లు కేంద్రం భావించింది అనుకోవాలా అన్న ప్రశ్న వచ్చింది.అబద్దాలు ఆడితే ఎంత నష్టం జరిగేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.అలాగే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని ముఖ్యమంత్రే అబద్దం చెబితే కేంద్రం పట్టించుకోవలసిన అవసరం ఉంటుందా అన్న ప్రశ్న వస్తుంది. చంద్రబాబు అప్పటికప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏదో ఒక అబద్దం చెప్పాలని అనుకోవడం వల్ల ఎపికి అప్రతిష్టే కాకుండా,రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.ఆ విషయాన్ని ఇప్పుడు తెలుగుదేశం నేతలుగమనించే పరిస్థితిలో లేరు.ఎందుకంటే వారంతా అదికారం అనే కైపులో ఉన్నారు కదా!

tags : ap,jobs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info