A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం-పవన్ కళ్యాణ్ సందేహం
Share |
November 16 2018, 12:56 am

ప్రముఖ నటుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు ఒక సందేహం వచ్చింది. సచివాలయం కట్టలేకపోయినవారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. తనకు పోలవరం ప్రాజెక్టుపై అవగాహన లేదని, అందువల్లే దాని గురించి తెలుసుకోవాలని వచ్చానని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన సర్ ఆర్దర్ కాటన్ సమయం నుంచి ఉన్నా,ఇంతవరకు పూర్తి కాలేదని ఆయనఅ న్నారు. పోలవరం పై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో.. ఓ ఒక్క పార్టీదో కాదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎంత లాభం, ఎంత నష్టం అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. ఎన్నో అవాంతరాలను దాటుకుని నిర్మాణం సాగుతున్నా అడుగడుగునా అడ్డంకులు పడుతూనే ఉన్నాయన్నారు. నిర్మాణం జాప్యం జరిగే కొద్దీ వ్యయం విపరీతంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.పోలవరం ప్రాజెక్టు వ్యయం ఏబైవేల కోట్లకు దాటిందని ఆయన అన్నారు. పోలవరంలో అవినీతి జరుగుతుందని అంటున్నారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.2019నాటికి పోలవరం పూర్తి కాదని ఆయన అబిప్రాయపడ్డారు.

tags : pawankalyan, polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info