A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయమ్మ-షర్మిల లు పోటీ 'పై జగన్ కామెంట్
Share |
February 24 2018, 5:50 pm

వచ్చే ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిలమ్మలు వచ్చే ఎన్నికలలో పోటీచేస్తారా?లేదా అన్న ఆసక్తికరమైన అంశం పై స్పందించారు. తమ కుటుంబంలో ఉన్న బందం చాలా బలమైనదని ఆయన అన్నారు.

పాదయాత్ర నేపథ్యంలో ఇంట్లో అమ్మగారు, భారతిగారు, పిల్లలు ఎట్లా రియాక్ట్‌ అవుతున్నారు?

పాదయాత్ర అనేది ముందు నాన్న చేశారు. రాజకీయాల్లో ఇప్పుడు ప్రజలకు అతి సమీపంగా దగ్గరుండి చూసే ప్రస్థానం ఇది. వారితో మమేకం కావడం, ఇంతకు ముందు ఓదార్పు యాత్ర చేసిన దానికంటే మోర్‌ ఇంటెన్సివ్‌ ఇది. ఇటువంటి కార్యక్రమంలో కుటుంబం మద్దతు చాలా ముఖ్యం. దేవుడి దయ వల్ల ఫ్యామిలీ సపోర్ట్‌ చాలా ఉంది.

మీరు ఎక్కువగా దేవున్ని నమ్ముతారా?
కచ్చితంగా నమ్ముతాను. ఐ స్ట్రాంగ్‌లీ బిలీవ్‌. ఏమైనా జరగాలి అంటే దేవుని చిత్తం లేనిదే ఏమీ జరగదని గట్టిగా నమ్ముతాను. నన్ను జైలులో పెట్టడం, ఓదార్పుయాత్ర చేస్తూ ఇంట్లో తక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ సమయం పిల్లలతో గడపలేకపోయాను. అయితే ఉన్న కొద్ది సమయంలో మాత్రం పిల్లలతో చాలా దగ్గరగా ఉంటాను. పాప అంత బాగా చదివి ప్రెస్టీజియస్‌ లండన్‌ స్కూల్లో సీటు రావడమన్నది మెచ్చుకోదగింది. వాళ్లమ్మను కూడా అప్రిషియేట్‌ చేయాలి.

అమ్మగారు కానీ, మీ సోదరి కానీ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి చురుగ్గా ఉంటున్నారా? మళ్లీ ఎన్నికల్లో పోటీచేయడం వంటివి ఉంటాయా?
అమ్మ, షర్మిల ఇద్దరూ నా కోసం ఏమైనా చేస్తారు. వాళ్లేమీ రాజకీయాల్లో ఉండాలని అనుకోలేదు. ఆరోజు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టి పార్టీయే లేకుండా చేయాలని చూశారు. మూడు నెలల్లో కచ్చితంగా చట్ట ప్రకారం బెయిల్‌ రావాల్సి ఉన్నా రానీయకుండా చేశారు. ఆరు నెలల పాటు మనిషే లేకుండాపోతే పార్టీయే లేకుండా పోతుందనే దుర్బుద్ధితో వీళ్లు చేసిన కుట్రల్లో నుంచి వారిద్దరూ బయటకు వచ్చారు. నాకు తోడుగా నిలబడ్డారు. పదవీ వ్యామోహం అమ్మకు.. పాపకు.. నా భార్యకు లేదు. ఎవరూ అలాంటి భావనతో ఉండరు. రిలేషన్‌షిప్స్‌ కూడా మా ఇంట్లో చాలా స్ట్రాంగ్‌. మా ఇంటి ఆడవాళ్లలో చాలా బలమైన బంధం ఉంది.

tags : jagan,vijayamma

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info