A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు కెవిపి సలహా ఇచ్చినప్పుడు రియాక్షన్
Share |
December 11 2017, 10:45 pm

కాంగ్రెస్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు గతంలో వెస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగాఉండేవారు.అప్పట్లో జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా కెవిపి ఏమని సలహా ఇచ్చారు.అప్పుడు జగన్ ఏమి సమాధానం ఇచ్చారన్నది తెలుసుకోవాలంటే ఇది చదవండి.జగన్ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు.

కేవీపీ గారు చెప్పారట కదా? వద్దు మనం వెళ్తే ఇబ్బంది అవుతుంది. ఇబ్బందులు వస్తాయని చెప్పారంటారు.?
నేను మాట ఇచ్చిన తరువాత ఏమైనా చెప్పొచ్చు. నేను మాట ఇచ్చిన తరువాత మాట ఎందుకిచ్చావని అడిగితే ఏం చెబుతాం. హెలికాప్టర్‌ ప్రమాదంలో నాయిన చనిపోయిన ప్రదేశానికి వెళ్లినం. 20 రోజులు కూడా కాలా. ఆ ప్రాంతం చూసిన తరువాత కిందికి నడుచుకుంటూ వస్తున్నాం. మాటల్లో నాన్న మరణం తట్టుకోలేక ఇంతమంది చనిపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారనే చర్చ వచ్చింది. అది మనసులో ఎందుకో తిరుగుతా ఉంది. కిందకు వస్తే సంతాప సభ. దాదాపు కొన్ని వేలమందితో కండోలెన్సు మీటింగ్‌ జరుగుతా ఉంది. అప్పుడు నాటైమ్‌ వచ్చినప్పుడు నేను మాట్టాడేదానికి మైక్‌ తీసుకున్నాను. మాట్లాడేప్పుడు ఎమోషనల్‌గా చెప్పిన. చనిపోయిన ప్రతి కుటుంబంలోని వాళ్లంతా నా కుటుంబ సభ్యులే. వాళ్ల ఇంటికి వస్తా. వారికి తోడుగా ఉంటా. వారికి భరోసా ఇస్తానని చెప్పిన. ఎందుకు చెప్పావంటే నాకు తెలీదు. జస్ట్‌ ఎమోషనల్‌గా చెప్పిన. నాయిన చనిపోయిన ప్రదేశంలో చెప్పినం కాబట్టి మాట నిలబెట్టుకోవాలని నా ఆరాటం. అది వీళ్లకు అర్థం కాదు. అది చినికిచినికి గాలివాన అయి అది లాస్ట్‌కు ఏ స్టేజికి వచ్చిందంటే నువ్వు పోతే నిన్ను ఇబ్బందులు పెడతాం. నువ్వు ఉండాలంటే మాట తప్పాల. నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాము. ఇంకోటిస్తాం. తరువాత ముఖ్యమంత్రిని చేస్తాం. ఇలా రకరకాలుగా ప్రలోభాలు. బట్‌ ఎండ్‌ ఆఫ్‌ద డే. అవన్నీ ఏమొచ్చినాయో దేవుడెరుగు. తీసుకున్నా నాకు వేల్యూ ఉండదు. ఇక్కడ విశ్వసనీయత పోయిన తరువాత, ఆయన చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పిన తరువాత.. చివరకు నేను, అమ్మ, పాప ముగ్గురమూ వచ్చాం. ముగ్గురమూ మాట్లాడాం. నేను అమ్మకు ఒక్కటే చెప్పాను. అమ్మా రెండు దారులున్నాయి. ఒకదారి అయితే మాట తప్పమంటున్నారు.. పదవులు ఇస్తామంటున్నారు. రెండో దారి అయితే మాట మీదే నిలబడతాం.. పదవులు రావు బహుశా ఇబ్బందులూ పెడతారు. బట్‌ మాట మీదయితే నిలబడతాం. మాట మీద నిలబడతారన్న పేరయితే నాన్నకు ఉంది. అల్టిమేట్‌గా ఏదో ఒకరోజు అందరమూ చనిపోతాం. చనిపోయిన తరువాత మన గురించి ప్రజలేమనుకుంటారనేది వాట్‌ విల్‌ లీవ్‌ బ్యాక్‌. ఆ మాట నేనన్నప్పుడు షర్మిల, అమ్మ, భారతి నన్ను సపోర్టుచేశారు. నీ ఆలోచనే కరెక్టు. మాట చెప్పిన తరువాత దానిపై నిలబడాల్సిందే. చేయాల్సిందే. తప్పేమీ కాదు. నిజాయితీగా ఉన్నాం. సోనియాగాంధీ గారికి రాజీనామా లేఖ రాసేసి పార్టీనుంచి బయటకు వచ్చేసినం. ఆ స్టేజికి వచ్చింది కనుక. బయటకు వచ్చినప్పుడు నేను, అమ్మ మాత్రమే ఉన్నాం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్, రాజంపేట ఎమ్మెల్యే అమరనా«థ్‌రెడ్డి నా దగ్గరకు వచ్చి అన్నా మీతో పాటు మేము కూడా వస్తామన్నా అన్నారు. అసలు నాకే నా పొలిటికల్‌ జీవితమేమిటన్నది నాకే తెలియటంలా. నీవు నాతో ఫాలో అవుతానంటున్నావు. వద్దు శ్రీకాంత్‌. దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు కావాలంటే వద్దువులే అన్నాను. నాదంటే ఒక మాట చెప్పినం ఆ మాటకు కట్టుబడాలా. అయితే అయ్యింది లేకపోతే లేదు. తినేదానికి ఏమీ లేని పరిస్థితుల్లో లేము కదా? రాజకీయాలు చేస్తే న్యాయంగా చేస్తం. ధర్మంగా చేస్తం అనిచెప్పి వచ్చేసిన. దేవుడు ఆశీర్వదించాడు. ప్రజలు ఆదరించారు. ఆ తరువాత కథంతా మీకు తెలిసిందే.

tags : kvp, jagan

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info