A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుజరాత్ లో ఇవిఎమ్ ల టెస్టింగ్
Share |
August 22 2018, 8:46 am

ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ల (ఇవి ఎమ్) విశ్వసనీయత పై దృష్టి పెట్టాయి. గుజరాత్ లో ఇవి ఎమ్. ల టాంపరింగ్ జరివగిందనో, ఒకే పార్టీ గుర్తుకు ఓట్లు వెళుతున్నాయనో ఆయా పార్టీలు చేస్తున్న ఆరోపణలను పూర్వపక్షం చేసేదుకు గాను ఎన్నికల సంఘం చర్యలు చేపడుతున్నట్లు ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎకె జోతి చెప్పారు.ఇందులో భాగంగా గుజరాత్ లో ప్రతి నియోజకవర్గంలోను ఒక పోలింగ్ బూత్ కు సంబందించిన ఇవి ఎమ్ ను తనిఖీ చేయిస్తామని ఆయన చెప్పారు. దీనిని లాటరీ పద్దతిలో అబ్యర్ధుల సమక్షంలో ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఇవి ఎమ్.లకు ఉండే ఆడిట్ వెరిపయింగ్ ఏర్పాటుతో పోలైన ఓట్లను సరిపోల్చడం ఝరుగుతుందని ఆయన చెప్పారు.ఉత్తరప్రదేశ్ లో స్థానిక ఎన్నికలలో ఇవి ఎమ్ లపై పార్టీల ఆరోపణ గురించి ప్రశ్నించగా, అది అక్కడి స్థానిక ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని,అంతేకాక వారు ఎమ్.1 తరహా మిషన్లు వాడారని, తాము వినియోగించేది ఎమ్.2 మిషన్లు అని ఆయన వివరించారు.

tags : gujarat, evm

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info