A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగు మహాసభలలో తెలంగాణ ఔన్నత్యం
Share |
May 27 2018, 5:15 pm

తెలంగాణ ఔన్నత్యాన్ని చాటేవిధంగా ప్రపంచ తెలుగు మహా సభలు ఉంటాయని ఉప
ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.
తెలంగాణ జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా
రెండున్నర కోట్ల రూపాయలతో డాక్యుమెంటరీని కూడా
రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహా సభల
ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి
కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటైన సబ్ కమిటీ నేడు ఎల్.బి
స్టేడియంలో సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో మంత్రి
తుమ్మల, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సాహిత్య
అకాడమీ చైర్మన్ నందిని సిద్దరెడ్డి, ప్రభుత్వ సలహాదారు
రమణాచారి, ప్రభుత్వ గ్రంథాలయ సంస్థల చైర్మన్ శ్రీధర్,
తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ ప్రభాకర్ రావు,
స్పోర్ట్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, వివిధ శాఖల
ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రపంచ తెలుగు
మహా సభలు హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించి, ఈ

నిర్వహణ కోసం సిఎం కేసిఆర్ కోర్ కమిటీని కూడా నియమించారని
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దీంతో పాటు వచ్చే
అతిథుల కోసం, సభా నిర్వహణ, వేదిక, అలంకరణ, సాహిత్య,
సాంస్కృతిక కార్యక్రమాల కోసం కూడా వివిధ కమిటీలు ఏర్పాటు
కావడంతో పాటు పని కూడా మొదలు పెట్టాయని అన్నారు. ఈ
కమిటీలకు ఇప్పటికే వాటి బాధ్యతలు, జాబ్ చార్ట్, మైక్రో
లెవల్ ప్లానింగ్ కూడా ఉన్నాయన్నారు. తెలుగు మహాసభల కోసం
ఇప్పటికే సిఎం కేసిఆర్ 50 కోట్ల రూపాయలను మంజూరు
చేశారన్నారు. ఈ నిధులు వేదికల ఏర్పాటు, అలంకరణ, అతిధుల వసతులు,
సౌకర్యాల కోసం ఖర్చుచేస్తున్నామన్నారు. ఈ నెల 7వ తేదీన
సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి సమావేశమై
ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను మరింత లోతుగా
సమీక్షిస్తామని చెప్పారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశించినట్లు తెలంగాణ జీవన
విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, ప్రజలందరి
భాగస్వామ్యంతో ఈ సభలు విజయవంతం అయ్యేలా
పనిచేస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు.

tags : kadiyam, telugu

Latest News
*టిడిపి ఉమ్మడిగా తిని ఒంటరిగా..పవన్ వ్యాఖ్య
*చంద్రబాబు ఎందుకు బయపడుతున్నారు
*తిరుమల వివాదం-బిజెపి కుట్ర- చంద్రబాబు
*హైదరాబాద్ నిర్మాణం చేశా- చంద్రబాబు
*టిడిపి అదైర్య పడే పరిస్థితి లేదు
*టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
*మంచి శాఖల కోసం పాట్లు-కుమారస్వామికి బొప్పి
*విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
*వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
*జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
*వెంకన్న కు కూడా కులం పూస్తారా-బిజెపి
*ఆంద్రవాళ్లూ కెసిఆర్ పాలన కోసం..
*దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
*ముద్రగడ లేఖాస్త్రం
*బిజెపి మళ్లీ గెలవదు-చంద్రబాబు
*మోడీ ప్రచార ప్రదానే..చంద్రబాబు ద్వజం
*బిజెపిది నమ్మక ద్రోహం- చంద్రబాబు
*వైసిపిలో కి ఇద్దరు ప్రముఖులు
*నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
*తెలంగాణలో టిడిపి కింగ్ మేకర్ అంటే అర్దం ..
*మోడీకి ఎ ప్లస్ గ్రేడ్ ఇచ్చిన రాహుల్
*చంద్రబాబుపై పవన్ ఘాటు వ్యాఖ్య
*అర్చకత్వం అంటే ఎమ్మెల్యేలను కొనడం కాదు
*చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
*టిడిపిలో దళితులకు అవమానం..టిఆర్ఎస్
*ప్రజలలో సంతృప్తి పెరిగిందట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info