A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
5700 చెరువులు పునరుద్దరిస్తాం
Share |
December 11 2017, 10:42 pm

మిషన్ కాకతీయ 4 వ దశ కింద 5703 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.ఎం.కె లో ప్రజల భాగస్వామ్యాన్ని ఇంకా పెంచాలని మంత్రి కోరారు. ఇకపై పది రోజుల కోసారి మిషన్ కాకతీయ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఒకసారి తిరస్కరించిన పనులను మరోసారి పంపించే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని హరీశ్ రావు హెచ్చరించారు. 4 వ దశ పనులను ప్రారంభించేందుకు సంబంధిత ఎం.ఎల్.ఎ, ఎం.ఎల్.సి,ఇతర ప్రజాప్రతినిధుల టైమ్ ముందుగానే
తీసుకోవాలని మంత్రి కోరారు.4 వ దశ కింద తలపెట్టిన5703 చెరువుల పునరుద్ధరణ  పనులకు గాను ఈ నెలాఖరులోగా పరిపాలనాపరమైన అనుమతి పొందాలని
ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు.ఇంత వరకు ప్రభుత్వానికి 2308 పనుల ప్రతిపాదనలు అందాయని తెలిపారు. మంగళవారం ఇక్కడ సెక్రెటేరియట్ లో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.మిషన్ కాకతీయ కింద చేపట్టనున్న పనులలో సంబంధిత సాగునీటి వనరుల ఆయకట్టును స్థిరీకరణకు,అలాగేఅదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఎస్.ఈ, ఈ. ఈ.లు క్షేత్ర స్థాయిలోనిరంతరం పర్యటించాలని,పర్యవేక్షించాలని ఆదేశించారు.4 వ దశ లో చేపట్టనున్న చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందిస్తున్నందునపూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలని  హరీశ్ రావు ఆదేశించారు. గతంలో
తెలంగాణ లో కేవలం భూసార పరీక్ష కేంద్రాలు 9 మాత్రమే ఉండేవని ఇరిగేషన్ మంత్రి చెప్పారు. ఇప్పుడు ప్రతిమూడు గ్రామ పంచాయతీ లకు కలిపి ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ ఉందన్నారు. మొత్తం 2,500 సాయిల్ టెస్ట్ ల్యాబ్ లున్నట్టు మంత్రి తెలిపారు.

tags : harishrao, tanks

Latest News
*కేంద్రం కొత్త బిల్లు- బ్యాంకు డిపాజిట్లపై వివరణ
*చంద్రబాబు మళ్లీ పాతపాట పాడారు
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*మోడీ వ్యాఖ్యలకు బాధపడ్డ మన్మోహన్ సింగ్
*న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద బాంబు పేలుడు
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info