A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విలేజ్ మాల్స్-చంద్రబాబు మరో మోసం
Share |
August 22 2018, 8:49 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడానికే మాల్స్ అంటున్నారని విపక్ష నేత జగన్ విమర్శించారు.అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ప్రసంగించారు.బాబు రాకముందు వరకు రేషన్‌ షాపుల్లో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. వేలి ముద్రలు పడటం లేదని వాటిలో కూడా కోత విధిస్తున్నారు. ఇందులో లోపాలను సరిచేసి పేదలను ఆదుకోవాల్సింది పోయి బడా మాల్స్‌ వారికి వీటిని కట్టబెడతారట. గ్రామాల్లో రేషన్‌ షాపుల స్థానంలో మాల్స్‌ పెడతానని చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు. బాబు రాకముందు రేషన్‌ షాపుల్లో ఇచ్చే సరుకుల సబ్సిడీ బిల్లే రూ.2000 కోట్ల నుంచి రూ.3000 కోట్లు ఉండేది. ఇçప్పుడేమో రిలయన్స్‌ వాళ్లు వచ్చి 20 శాతం తక్కువకు అమ్మే విధంగా మాల్స్‌ పెడతారంటున్నావు. ఇంకా మీ సంస్థ (హెరిటేజ్‌)తో భాగస్వామ్యం ఉన్న ఫ్యూచర్‌ గ్రూపునకూ ఇస్తామంటున్నారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికే ఈ ప్రక్రియను మొదలు పెట్టారని మనవి చేస్తున్నా. ఎన్నికలపుడు జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు. జాబు ఇవ్వక పోతే ప్రతి ఇంట్లో నిరుద్యోగికి రూ.2000 భృతి ఇస్తానన్నారు.ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు అని ఆయన విమర్శించారు.

tags : jagan, village malls

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info