A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ,జగన్ ల గురించి పవన్ ..
Share |
August 22 2018, 8:48 am

ప్రముఖ నటుడు ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ లో ఇంకా గందరగోళం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది.తనకు సినిమా అన్నం పెట్టిందని, రాజకీయాలోకి రావాలని తాను 2003లోనే అమ్మా,నాన్నకు చెప్పానని ఆయన అంటున్నారు. జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. తనకు లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ,పటేల్, అంబేద్కర్ స్పూర్తి అని ఆయన అన్నారు. రాజకీయాలు బాగుంటే సినిమాలు వదలి వచ్చేవాడినని ఆయన అన్నారు.తాను దైర్యం తెచ్చుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని ఆయన అన్నారు. ప్రజారాజ్యం ఓటమి తనకు బాద కలిగించిందని ఆయన చెప్పారు.దానికి కారణమైన వారిని మర్చిపోనని, చిరంజీవికి ద్రోహం చేసినవారిని జనసేన ద్వారా దెబ్బకొడదాం అని ఆయన అన్నారు.తండ్రి ముఖ్యమంత్రి అయితే తాను ముఖ్యమంత్రి అవుతాననడం తప్పు అని ఆయన అన్నారు. చంద్రబాబు వాడుకుని వదలివేస్తారని కందరు తనతో చెప్పారని, ఆ విషయం తనకు తెలియదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు జగన్‌ అంటే నాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని ఆయన అన్నారు.పవన్ కళ్యాణ్ ఎపిలో చంద్రబాబు, జగన్ లను ఇద్దరిని వ్యతిరేకిస్తున్నారా?లేక ఒకరిని వ్యతిరేకిస్తున్నారా?ఏమిటో ఆయన ఉద్దేశం?

tags : pawan kalyan, jagan, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info