A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖలో పవన్ కళ్యాణ్ - పరామర్శ
Share |
November 16 2018, 1:26 am

జనసేన అదినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్లారు. అక్కడ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్న నేపద్యంలో ఆ ఉద్యోగి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.ఈ కార్పొరేషన్ ప్రైవేటైజ్ చేస్తున్నారన్న దానిపై ఆ ఉద్యోగి కలత చెందారు. ఈ సందర్భంగా అక్కడ వామపక్ష నేతలు కూడా పాల్గొని మాట్లాడారు. బిజెపి ఈ కార్పొరేషన్ ను ఎందుకు ప్రైవేటైజ్ చేస్తోందని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభ/త్వ సంస్థలను కాపాడుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు.డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు పవన్ కళ్యాణ్ సంఘీ భావం చెప్పారు.పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబంతో పాటు కింద కూర్చున్నారు.

tags : pawankalyan, tour, vizag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info