A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో పాలనపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Share |
November 16 2018, 12:36 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వైపు దక్షిణ కొరియా కు పెట్టుబడుల పేరుతో యాత్రచేస్తుంటే, ఎపిలో పాలన తీరుపై పెట్టుబడుల కు అనువైన వాతావరణం కల్పించకపోవడంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు కదనం. అక్కడి వ్యవహారాలను గమనిస్తుంటే గుండె దహించుకుపోతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమ ముందుకు వస్తున్న అనేక కేసులను విచారిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవగతమవుతోందని తెలిపింది. పాలన మొత్తం ఒక పద్ధతి లేకుండా గందరగోళంగా తయారైందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ మలేసియా, సింగపూర్, కొరియా కంపెనీలను ఆహ్వానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడి కంపెనీలు, పరిశ్రమల గురించి పట్టదా? అని ప్రశ్నించింది. పరిశ్రమ ఏర్పాటు కోసం భూములు కేటాయించినప్పుడు, రెవెన్యూ రికార్డుల్లో ఆ మేరకు మార్పులు చేయకపోగా, పరిశ్రమ ఏర్పాటు చేయలేదంటూ ఆ భూములు స్వాధీనం చేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. పరిశ్రమకు కేటాయించిన భూమిని తిరిగి ఆ కంపెనీకి స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్‌.రామచంద్రరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

tags : highcourt, ap,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info