A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ సి.ఎమ్. కావాలన్నది ప్రజల ఆకాంక్ష
Share |
November 16 2018, 12:05 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష ప్రజలలో రోజురోజుకు పెరుగుతోందని మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి అన్నారు.వచ్చే ఎన్నికలలో తమ పార్టీ అదికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.రాష్ట్రంలో ప్రజలు వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారని అందుకు రెండు కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఒకటి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అదే సమయంలో వైఎస్‌ జగన్‌పై వారిలో నెలకొన్న సమ్మోహన శక్తి. ఈ రెండూ కూడా వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారబోతున్నాయని శిల్పా చెప్పారు. జిల్లాలో రైతులు, యువకులు ఇలా ప్రతీ ఒక్క వర్గం నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర వైపు మొగ్గుచూపటంతో విజయవంతం అయ్యిందని, వారి ఆశీర్వాదం జననేతకు నూటికి నూరుపాలు ఉంటాయని మోహన్‌రెడ్డి అన్నారు

tags : silpa,jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info