A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోదండరామ్ ఏమి చేసినా కెసిఆర్ ఏకాగ్రత సడలదు
Share |
February 24 2018, 5:54 pm

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పై టిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు టిఆర్ఎస్ ఎమ్.పి బల్క సుమన్ మాట్లాడుతూ జెఎసి చర్మన్ కోదండరామ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకాగ్రతను దెబ్బతీయలేరని అన్నారు.కెసిఆర్ అబివృద్ది లక్ష్యంగా సాగుతున్నారని, ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకున్నారని ఆయన చెప్పారు.కోదండరామ్ చేపట్టింది కొలువులకై కొట్లాట కాదని తన పదవి కోసం చేపట్టిన తండ్లాట అని అభివర్ణించారు. కోదండరామ్‌ తీరు మార్చుకోకపోతే విద్యార్థులు, యువతే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం లక్షా 12వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు.తెలంగాణ జెఎసి ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట సభలో జనం లేరని అది ప్లాప్ అయిందని టిఆర్ఎస్ విప్ పల్లా రజేశ్వరరెడ్డి అన్నారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మురళి ఆత్మహత్యపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మురళి ఆత్మహత్యకు కారణం తెలిసి కూడా తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు.

tags : suman,kodandaram

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info