A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరువు నష్టం కేసు వేస్తానంటున్న రోజా
Share |
November 16 2018, 12:05 am

తెలుగుదేశం ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడుపై పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా చెప్పారు. తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన ముద్దుకృష్ణమ నాయుడు వాటిని రుజువు చేయాలని ఆమె సవాల్ చేశారు.హంద్రీ-నీవా లైన్ అలైన్ మెంట్ మార్చి భూములు పొందానని ఆయన అంటున్నారని, అవన్ని అవాస్తవాలని, వాటిపై తాను పరువు నష్టం కేసు వేస్తానని ఆమె హెచ్చరించారు. దీనిపై ఆయనతో బహిరంగ చర్చకు సిద్దమని కూడా అన్నారు. కాగా ముద్దుపై ఆమె ఆరోపణలు గుప్పించారు. తిరుమల టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించి డబ్బు సంపాదించారని, ముద్దు ఎన్ని సేవా టిక్కెట్లు పొందారు సమాచార హఖ్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే తెలుస్తుందని ఆమె అన్నారు.నగరి రోడ్డు కాంట్రాక్టర్ గా ఉన్న రాయపాటి సాంబశివరావు ఆయనకు తిరుపతిలో ఇల్లు కట్టించి ఇచ్చారని కూడా ఆమె ఆరోపించారు.

tags : roja, damage

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info